రాజకీయాల్లో అందరూ పదవి కోరుకుంటారు. కానీ తెలంగాణలో ఎమ్మెల్యేలు మాత్రం వద్దే వద్దనే పదవి ఒక్కటి ఉంది.. అదే స్పీకర్ పదవి. ఒక్క సారి స్పీకర్ పదవి చేపడితే.. మళ్లీ గెలవరన్న నమ్మకం రాజకీయవర్గాల్లో ఉంది. అందుకే ఈ సారి తెలంగాణ స్పీకర్ పదవికి… చాలా మంది పేర్లు ప్రచారంలోకి వచ్చినా… ఎవరూ తీసుకోవడానికి ముందుకు రాలేదు. దాంతో… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టుబట్టి.. బలవంతం చేసి.. మరీ .. సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డికి పదవి అప్పగిస్తున్నారు. నామినేషన్లు కూడా… వేరే పార్టీ నుంచి దాఖలయ్యే అవకాశం లేదు కాబట్టి.. ఆయన స్పీకర్ గాఎన్నిక కావడం ఖాయమే.
సాయంత్రం ఐదు గంటల వరకు… స్పీకర్ పదవికి నామినేషన్లు వేసే గడువు ఉంది. ఇప్పటికే స్పీకర్ పదవికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎవర్ని నామినేట్ చేస్తే వారు ఏకగ్రీవంగా ఎన్నికలవడం లాంఛనమే. అయితే సంప్రదాయం ప్రకారం.. కేసీఆర్ మిగతా అన్ని పార్టీల నేతలకు.. ఫోన్లు చేసి … స్పీకర్ ఎన్నికకు సహకరించాలని కోరారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం… పార్టీలో చర్చించి చెబుతామని చెప్పారు. అయితే… స్పీకర్ ఎన్నికకు పోటీ పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేయకపోవచ్చనేది ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
డిప్యూటీ స్పీకర్ పదవిని సహజంగా విపక్షాలకు ఇస్తూ ఉంటారు. కానీ గత కొంత కాలంగా ఆ సంప్రదాయం కూడా పాటించడం లేదు. ఈ సారి కూడా.. డిప్యూటీ స్పీకర్ టీఆర్ఎస్ కే దక్కనుంది. అయితే కేసీఆర్ మరింత వినూత్నంగా ఆలోచించి… ఎంఐఎంకి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న చర్చ కూడా టీఆర్ఎస్ లో నడుస్తోంది.