చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు అయింది. ఇటీవల ఓ బాలిక విషయంలో చెవిరెడ్డి అత్యంత ఘోరంగా వ్యవహరించారు. ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన చిన్న గొడవ విషయంలో చిన్న పిల్లపై అత్యాచారం చేసేశారని చెవిరెడ్డి ప్రచారం చేశారు. తన నియోజకవర్గంలో ఘోరాలు జరిగిపోతున్నాయని తప్పుడు ప్రచారం చేశారు.
తీరా వైద్యుల నివేదికలో ఆ పాపపై అత్యాచారం జరగలేదని తేలిపింది. మొత్తం విచారణలో ఆ పాప తన ఫ్రెండ్ జరిగిన గొడవ కారణంగా అలాంటి సీన్ క్రియేట్ చేసిందని తేలింది. విషయం తెలియగానే ఇదే సందనుకుని రాజకీయంగా తప్పుడు ప్రచారం చేసిన చెవిరెడ్డికి ఆ పాప తండ్రే షాక్ ఇచ్చారు. అసలు ఏమీ జరగలేదని వైద్య నివేదికలు చెప్పినా పదే పదే సామూహిక అత్యాచారం అంటూ ప్రచారం చేశారని.. ఎన్నిసార్లు చెప్పినా అదేమాట్లాడుతున్నారని పాప భవిష్యత్ తో ఆడుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణ జరిపిన పోలీసులు చెవిరెడ్డికి అంతా తెలిసే పాప జీవితాన్ని నాశనం చేసేలా అత్యాచారం ఆరోపణలు చేశారని గుర్తించారు. పోక్సో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు సీరియస్ అంశం. ఆయనను అరెస్టు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఆయన చంద్రగిరి నుంచి పోతారా లేకపోతే.. అక్కడే ఉంటారా అన్నది తేలాల్సి ఉంది.