జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే.. పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండర్లేశారు. మేఘా కృష్ణారెడ్డికి పిలిచి మరీ టెండర్లు కట్టబెట్టారు. ఐదు వందల కోట్లు ఆదా అయిందని డప్పు కొట్టారు. కానీ ఆ మొత్తానికి ఉచిత ఇసుక ఇచ్చారు. సరే ఏదో ఒకటి ప్రాజెక్టు అయినా పూర్తి చేస్తారనుకుంటే.. మొత్తం పడుకోబెట్టేశారు. గత ఐదేళ్ల కాలంలో ప్రధాన డ్యాం సహా ఏ పనులూ జరగలేదు. ఫలితంగా ఇప్పుడు ఆ ప్రాజెక్టు అంచనాలు దాదాపుగా ఐదు వేల కోట్ల మేర పెరుగిపోయాయి. ఇది ఒక్క ప్రధాన డ్యాం విషయంలోనే.
ఒక్క రోజు పనులు ఆగిపోతే దాదాపుగా ఐదు కోట్ల రూపాయల నష్టం వస్తుంది.అందుకే.. పోలవరం పనులు రేయింబవళ్లు.. పూర్తి సామర్థ్యంతో జరగాల్సిందేనని చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లను హెచ్చరించేవారు. అధికారులను అప్రమత్తం చేసవారు. దానికి తగ్గట్లుగానే పనులు జరిగేవి. విదేశాల నుంచి అత్యంత భారీ యంత్రాలను తీసుకు వచ్చి నిరంతరాయంగా పనులు చేసేవారు. కానీ అక్కడ గత ఐదేళ్లుగా పనులు జరగడం లేదు. రివర్స్ టెండర్లేసిన జగన్ రెడ్డి నాయకత్వ సామర్థ్యానికి తగ్గట్లుగా పనులు ఆగిపోయాయి.
మనం సాధారణంగా ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటే.. ఇప్పుడు ఇరవై లక్షలు అవుతుందనుకుంటే..దాన్ని మధ్యలో ఆపేసి ఐదేళ్ల తర్వాత కట్టాలనుకుంటే ఎంత అవుతుంది. ఈజీగా నలభై లక్షలవుతుంది. ఇంత చిన్న లాజిక్… అర్థం కావడానికి పెద్ద తెలివి తేటలు అవసరం లేదు.కానీ ఆ తెలివి తేటలు జగన్ రెడ్డికి లేవో లేకపోతే.. పోలవరం ప్రాజెక్ట్ ఎలా పోతే నాకెందుకు మావోళ్లకు డబ్బులు రావాలంతే అని అనుకున్నారో కానీ.,. మొత్తంగా ప్రాజెక్ట్ భవితవ్యాన్ని రివర్స్ చేసి.. ఇప్పుడు మెయిన్ డ్యామ్ ప్రాజెక్ట్ అంచనాలను ఐదు వేల కోట్లు అదనంగా పెంచేశారు.
ప్రజా ధనాన్ని.. రాష్ట్ర కరువును తీర్చే ప్రాజెక్టును పూర్తిగా నాశనం చేసి స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం.. ఇప్పుడు దాని భవిష్యత్ నే ప్రశ్నార్థకం చేసిన పాలకుడు కళ్ల ముందు ఉన్నాడు. ఐదు వందల కోట్లు ఆదా చేసినట్లుగా ప్రచారం చేసుకున్నారు.. ఇప్పుడు ఐదు వేల కోట్లఅదనపు భారం మాత్రమే కాదు.. ఎన్నో లోపాలు ఈ నిర్లక్ష్యం వల్ల వెలుగు చూశాయి. దీనికి బాధ్యులెవరు ?