పోలవరం హెడ్ వర్క్స్, విద్యుత్ కేంద్రం రివర్స్ టెండర్లను.. రీ టెండర్ గా మార్చిన సర్కార్.. మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి పనులను కట్టబెట్టాలని నిర్ణయించింది. జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి 4987 కోట్లకు ప్రభుత్వం రివర్స్ టెండర్లను పిలిచింది. మేఘా కంపెనీ రూ. 4358 కోట్లకు టెండర్ దాఖలు చేంది. రివర్స్ టెండర్ల ద్వారా రూ. 628 కోట్ల ఆదా అయిందని ప్రభుత్వం చెబుతోంది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే 12.6 శాతం తక్కువకు మేఘా కంపెనీ టెండర్ దాఖలు చేసిది. మేఘాకు కాంట్రాక్ట్ కట్ట బెట్టే ఉద్దేశంతో… ప్రభుత్వం.. చాలా పిల్లిమొగ్గలు వేసింది. చివరి క్షణంలోనూ నిబంధనలు మార్చింది. రివర్స్ టెండర్ నిబంధనల ప్రకారం.. కనీసం ఇద్దరు బిడ్డర్లు ఉండాలి. లేకపోతే.. మరోసారి టెండర్లను పిలవాల్సి ఉంటుంది.
అయితే.. చివరి క్షణంలో రివర్స్ టెండర్ ను రీ టెండర్ గా మార్చిన.. ప్రభుత్వం మేఘా కే పనులు అప్పగించాలని నిర్ణయం తీసేసుకుంది. దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఎల్-1గా వచ్చిన సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక అంచనా వ్యయాంగా పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా బిడ్డింగ్ నిర్వహించారు.
అధికారంలోకి రాగానే… రివర్స్ టెండరింగ్‌లో భాగంగా పోలవరం కాంట్రాక్టును రద్దు చేసి తిరిగి టెండర్‌ను పిలిచింది ఏపీ సర్కార్. చివరికి అది.. విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా రిజర్వ్ టెండర్ గా మారిపోయింది. ముందుగా కాంట్రాక్ట్ ఎవరికివ్వాలో నిర్ణయించుకుని .. రీ టెండర్ వేస్తున్నారని టీడీపీ అధినేత కూడా ఆరోపణలు గుప్పించారు. మేఘా కంపెనీకీ.. అతి తక్కువకు పనులు చేపట్టడానికి అంగీకరించిందని దానికి తర్వాత ప్రభుత్వ పెద్దలు ఎలా లబ్ది కలిగిస్తారో చెబుతూ.. కొన్ని కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దానికి తగ్గట్లుగానే.. మేఘా కంపెనీనే.. అంతే స్థాయిలో … తక్కువకు పనులు చేపట్టడానికి రంగంలోకి వచ్చింది.
ఇప్పటికిప్పుడు… ప్రభుత్వం బిడ్లను ఖరారు చేసినా… పనులు చేపట్టే అవకాశం మాత్రం లేదు. ఈ రివర్స్ టెండర్ ను పీపీఏ ఆమోదించాల్సి ఉంటుంది. అసలు పీపీఏ .. ఈ ప్రక్రియకు ఎప్పుడూ ఆమోదం తెలియచేయలేదు. తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తోంది. అలాగే కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అసలు రివర్స్ టెండరింగ్ కు వెళ్లవద్దని కోర్టు స్టే ఇచ్చినప్పటికీ.. ప్రభుత్వం ముందుకే వెళ్లింది. ఇప్పుడు.. రూ. 628 కోట్లు ఆదా అవుతున్నాయన్న దాన్ని చూపి… ఏపీ సర్కార్ అటు కేంద్రాన్ని.. ఇటు హైకోర్టును అంగీకరించేలా చేయాలని చూసే అవకాశం ఉంది.