నారా లోకేష్ పాదయాత్రలో స్టూల్ ను కూడా నిషేధింారు పోలీసులు. గ్రామాల్లో ఆయన ప్రసంగించకూడదని ఎప్పుడో మైక్ లాక్కున్నారు. కానీ ఆయన చిన్నస్టూల్ తెచ్చుకుని దానిపై నిలబడి అందరికీ కనబడేలా మాట్లాడుతున్నారు. ఇది కూడా నచ్చడం లేదేమో కానీ.. పోలీసులు గురువారం ఆయనకు చెందిన స్టూల్‌ను కూడా లాగేసుకున్నారు. పాదయాత్రలో స్టూల్ ఎక్కి మాట్లాడకూడదని ఎక్కడైనా చట్టాల్లో ఉందేమో చూపించాలని పోలీసుల్ని టీడీపీ కార్యకర్తలు నిలదీశారు. కానీ అలాంటివేమీచూపించలేదు కానీ స్టూల్ ను మాత్రం ఎత్తుకెళ్లిపోయారు.
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఆయన ప్రతీ చోటా మైక్‌పట్టుకుని మాట్లాడారు. ఎవరూ అడ్డుకోలేదు. కానీ బహిరంగసభలు పెట్టుకుంటే సరే లేకపోతే.. మాత్రం మైక్ లో మాట్లాడకూడదని పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. జీవో నెంబర్ 1 ప్రకారం మైక్‌లో మాట్లాడకూడదంటున్నారు. ఈ జీవోనెంబర్ వన్ పై నిర్ణయం హైకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉంది. స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో ప్రతిపక్షాల ప్రజాస్వామ్య హక్కుల్ని పోలీసులు నిస్సంకోంగా అణిచి వేస్తున్నారు.
ఓ వైపు చంద్రబాబు నాయుడు పర్యటనలకు పోటెత్తుతున్న జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులే రంగంలో దిగుతున్నారు. వారే కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. మరో వైపు లోకేష్ పాదయాత్రపై ఆంక్షలు విధిస్తున్నారు.వైసీపీ కార్యకర్తలకు దాడులకు తెగబడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా లైట్ తీసుకుంటున్నారు. చివరికి స్టూల్స్ కూడా ఎత్తుకెళ్తూండటంతో పోలీసుల పరిస్థితిపై టీడీపీ కార్యకర్తలు జాలి చూపిస్తున్నారు.