సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో తెలియదు.. చిన్న ఆధారం లేదు.. అసలు రాయే దొరకలేదు అయినా సాక్షిలో వచ్చిన కథనాన్ని బాలుడి రిమాండ్ రిపోర్టుగా రాసేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అదుపులోకి తీసుకున్న మూడు రోజుల పాటు తమ వద్దే ఉంచుకుని.. తమకు కావాల్సిన స్టేట్మెంట్లు రాయించుకున్నారేమో కానీ.. మరో టీడీపీ చోటా లీడర్ ను అదుపులోకి తీసుకుని.. అతన్ని మాత్రం అరెస్టు చూపించలేదు. అతనితో తప్పుడు స్టేట్మెంట్ల కోసం ఇంకా ప్రయతనిస్తున్నారేమోనని ఎవరికైనా డౌట్ రావడం సహజం.
గతంలో టీడీపీ నేతలపై ఎంత తీవ్రమైన దాడులు జరిగినా.. చివరికి కన్ను పోయేలా దాడి చేసినా హత్యాయత్నం కేసు పెట్టని పోలీసులు ఇప్పుడు రాయి విసిరారని హత్యాయత్నం కేసు పెట్టారు. హత్యాయత్నం కేసు పెట్టాలంటే చాలా నిబంధనలు ఉంటాయి. మారణాయుధం ఉండాలి. దాడి చేసినట్లుగా ఉండాలి. కానీ అలాంటివేమీ లేకుండా.. కేవలం కోడికత్తి తరహాలో డ్రామా చేయడానికి గత ఎన్నికలకు ముందు ఎలా హత్యాయత్నం డ్రామా నడిపారో.. ఇప్పుడు అదే తరహాలో డ్రామా నడపడానికి సిద్ధమయ్యారు. దీనికి పోలీసులు సహకరిస్తున్నారు.
రాజారెడ్డి రాజ్యాంగంలో జేపీసీ సెక్షన్లు అమలు చేసే పోలీసులకు మరొక్క నెల మాత్రమే సినిమా నడుస్తుందని ఆ తర్వాత .. తప్పుడు కేసులు పెట్టినందున వారికీ జైలు తప్పదన్న హెచ్చరికలు వస్తున్నా పోలీసులు తగ్గడం లేదు. ప్రజల్లో పలుచన అయినా.. రాయిదాడి వెనుక టీడీపీ ఉందని ప్రచారం చేయడానికి పోలీసులు వైసీపీతో కలిసి కుట్ర చేసినట్లుగా టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.