అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి 10 రోజుల ముందు నుంచి మాధవ్ రెడ్డి.. కలెక్టర్ కార్యాలయానికి రాకపోకలు కొనసాగిస్తున్నారని గుర్తించిన పోలీసులు..ఈ ప్రమాదం జరగడంలో ఆయన హస్తం ఉందని అంచనాకు వచ్చారు.
ఈ క్రమంలోనే మాధవ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలెందుకు వరుసగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి మాధవ్ రెడ్డి వచ్చి వెళ్ళారు? ఫైల్స్ కు సంబంధించి ఎవరెవరిని కలిశారు..? ఆయనను సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళమని ఎవరైనా పురమాయించారా..? అనే విషయాలపై సమాధానాలు రాబట్టనున్నారు పోలీసులు.
Also Read కేంద్ర బడ్జెట్ పై వైసీపీ సైలెన్స్ ..ఎందుకు?
ఇప్పటికే ఇది యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్ అని తేల్చిన డీజీపీ..కీలక ఫైల్స్ ఉన్న గదిలోనే ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులు అగ్ని ప్రమాద సమాచారాన్ని ఎప్సీ, డీఎస్పీకి చేరవేయలేదు. దీంతో ఈ ఘటన వెనక పెద్ద కుట్రకోణమే ఉందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. పెద్దిరెడ్డి అనుచరుడిని అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.