తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు విషయంలో పోలీసులు చేసిన అతి పూర్తి స్థాయిలో వారి కుట్రపూరిత ప్రవర్తనకు సాక్ష్యంగా నిలిచింది. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ లో పేరు లేదు.కనీసం ఎఫ్ఐఆర్ లేదు. అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇస్తామన్నారు. ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా ఎఫ్ఐఆర్ కాపీని అధికారికంగా ఇవ్వలేదు. మూడు గంటల్లో రిమాండ్ రిపోర్ట్ ఇస్తామన్నారు. అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటలకూ రిమాండ్ రిపోర్ట్ చంద్రబాబుకు కనీ ఆయన తరపు లాయర్లకు కానీ అందలేదు. సీఐడీ చీఫ్ శనివారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టి సాయంత్రానికి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. తర్వాతి రోజు 24 గంటల సమయం ముగిసిన తర్వాతనే కోర్టులో ప్రవేశ పెట్టారు.
చంద్రబాబు వయసు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా 48 గంటల పాటు నిద్ర లేకుండా చేయడం చిన్న విషయం కాదు. అయినా ఉద్దేశపూర్వకంగా అలా చేశారు. అంటే.. ఎఫ్ఐఆర్ లేకుండానే అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్టు రెడీ చేయడానికి సీఐడీ వ్యవస్థ అంతా ఇరవై నాలుగు గంటలు కష్టపడినాసిద్దం చేయలేకపోయారు. గవర్నర్ అనుమతి ఉందో లేదో స్పష్టత లేదు. శనివారం ఉదయం 6 గంటలకు అరెస్ట్ చూపించారు. నిబంధనల ప్రకారం 24 గంటల్లో కోర్టులో అరెస్టు చూపించాలి. కానీ ఆదివారం ఉదయం 6 గంటలకు అతి కష్టం మీద కోర్టుకు చేరుకున్నారు. రిమాండ్ రిపోర్టు సమర్పించి.. ఫార్మాలిటీలు పూర్తయ్యే వరకూ ఆరు దాటిపోయింది. లెక్క ప్రకారం సమయం మించిపోయినట్లే.
ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు విషయంలో అత్యవసరం కాకపోయినా.. రెండున్నరేళ్ల కిందటి కేసులో… ఎనిమిదేళ్ల కిందట నోట్ ఫైల్ ను చూపించి… అదే సాక్ష్యం అని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. అంతకు మించి సాక్ష్యాల్లేవని క్లారిటీ వచ్చింది. విచారణ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సాక్షి కెమెరామెన్, రిపోర్టర్ సమక్షంలో విచారణ జరిపారు. ఇలా అన్ని రకాలుగా సీఐడీ అధఇకారులు చెలరేగిపోయారు. వ్యవస్థల పతనం ఎంత దారుణంగా ఉందో.. చంద్రబాబు అరెస్టులో వెల్లడయింది.