బెడ్ రూం తలుపులు బద్దలు కొట్టి… టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని.. కొడంగల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను.. నేడు అక్కడ నిర్వహిస్తున్నారు.. కొడంగల్‌కు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని.. క్షమాపణలు చెప్పిన తర్వాతే ఆయన కొడంగల్‌కు రావాలని.. లేకపోతే అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించారు. ఎక్కడిక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా… రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. బలవంతంగా తరలించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు.
రేవంత్ రెడ్డిని అర్థరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏమిటన్న చర్చ … తెలంగాణ వ్యాప్తంగా నడుస్తోంది. నిన్న అంతా.. ఆయనను హౌస్ అరెస్ట్ చేస్తారని పోలీసు వర్గాలు చెప్పుకొచ్చాయి. కానీ అనూహ్యంగా ఒక వంద మంది పోలీసులు రేవంత్ ఇంటిపై దాడికి దిగి.. ఇంటి తలుపులు ఎక్కడిక్కడ బద్దలు కొట్టి తీసుకెళ్లిపోయారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా హౌస్ అరెస్ట్ చేస్తారు. కానీ రేవంత్ విషయంలో పోలీసులు మరింత ఆందోళనకు గురయినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం.. కొడంగల్ బంద్‌కు రేవంత్ పిలుపునిచ్చారని.. కేసీఆర్ టూర్ ను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని.. ఈసీకి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలతో ఐపీసీ సెక్షన్లు 341, 188, 506, 511 కింద కొడంగల్ పోలీసు స్టేషన్లో రేవంత్‌పై కేసు నమోదు చేశారు. దాని ప్రకారమే ఇప్పుడు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
పోలింగ్‌కు మూడు రోజుల ముందుగా.. ఓ అభ్యర్థిని అదుపులోకి తీసుకోవడం.. ఎక్కడికి తరలించారో కుటుంబసభ్యులకు తెలియనివ్వకపోవడం కూడా.. కలకలం రేపుతోంది. రేవంత్‌రెడ్డిని ఇతర నియోజకవర్గాల్లో తిరగకుండా అడ్డుకొనేందుకే అధికారపక్షం ఆయనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని మహాకూటమి నేతలు ఆరోపిస్తున్నారు. రేవంత్ అరెస్ట్‌తో కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పెద్ద ఎత్తున బలగాలను… మోహరించారు. సీఎం సభ అయిపోయే వరకూ… రేవంత్ రెడ్డిని విడిచి పెట్టే అవకాశం లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
Breaking : Police broke into Revanth Reddy room , arrested him
Video : #TelanganaElections2018 #RevanthReddy pic.twitter.com/cN9pqRH2fQ
— Telugu360 (@Telugu360) December 3, 2018