సంచలనాల దర్శకుడు రాం గోపాల్ వర్మ పై కేసు నమోదైంది. వంగవీటి రంగా జీవిత చరిత్ర ఆధారంగా తీసిన “వంగవీటి” సినిమాలో తమ గౌరవానికి, తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగించారని కోర్టుని ఆశ్రయించారు వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా. పిటిషన్ ని స్వీకరించిన కోర్ట్, దర్శకుడు రాం గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ ల పై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది.
2016 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ విషయం తెలిసిందే. వంగవీటి అని టైటిల్ పెట్టి, వంగవీటి కంటే దేవినేని వర్గాన్ని హైలెట్ చేస్తూ సినిమా తీసాడని విడుద్లైన కొత్తలోనే విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లోనే రాధా కుటుంబం చేసిన విఙ్ఞప్తులు పట్టించుకోకపోవడమే కాక, రాధా కంటే తనకే రంగా గురించి ఎక్కువ తెలుసని వర్మ వ్యాఖ్యానించిన విషయం కూడా తెలిసిందే.
మరి కోర్ట్ కేసు ని వర్మ ఎలా ఎదుర్కొంటాడు, ఈ క్రమం లో మళ్ళీ ఏ సంచలనాలకి తెర లేపుతాడో వేచి చూడాలి.