బుల్లితెర రియాలిటీ షోలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ఈటివి జబర్దస్త్ షోకు ఈ మధ్య గడ్డు కాలం మొదలైందనే చెప్పాలి. అడల్ట్ కంటెంట్ తో సాగే ఆ షోని తెలుగు ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అప్పుడుప్పుడు శృతిమించిన సందర్భాల్లో తగిన మూల్యం చెల్లించుకున్నారు కూడా. ఇక జబర్దస్త్ షోలో చేసే కమెడియన్స్ తో యాంకర్ ఎఫైర్స్ అయితే చెప్పాల్సిన పనేలేదు. ఇవన్ని ఉండగా ఆ షోకి మరో కొత్త సమస్య వచ్చి పడ్డది.
ఈసారి ఏకంగా జబర్దస్త్ షోకి కోర్ట్ ద్వారా నోటీసులు రావడం జరిగిందట. రీసెంట్ జబర్దస్త్ షోలో భారతీయ న్యాయవ్యవస్థను అవమనించేలా స్కిట్ వేశారని ఓ న్యాయవాది కోర్ట్ లో పిటీషన్ వేశాడట. ఇక పిటీషన్ అంగీకరించి తీసుకున్న కోర్ట్ జబర్దస్త్ టీంకు నోటీసులు జారీ చేసిందట. ప్రజలను ఎంటర్టైన్ చేయడంలో తప్పుడు సందేశాలతో కార్యక్రమం ఉందంటూ ఇదవరకు ఎన్ని వివాదాలు వచ్చినా వాటిని సరిచేసుకుని ప్రోగ్రాం రన్ చేశారు. మరి ఇప్పుడు కోర్ట్ ఇచ్చిన షాక్ కు జబర్దస్త్ టీం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.