ఎలాటివారైనా ఏ పరిస్థితుల్లో చనిపోయినా మరణం ఎప్పుడూ బాధగానే వుంటుంది. అయితే తన వారంటూ దగ్గరగా లేకుండా పోవడం ఇంకా బాధాకరం. హీరో రవితేజ తమ్ముడు భరత్ అంత్యక్రియలు అలాగే ముగిశాయని వార్తలు చూశాను. ఆయన వాహనంలో దొరికిన మద్యం సీసా వంటివి పోలీసులు చూపించారు, వ్యాఖ్యానించారు కూడా. ఇదే పరిస్థితుల్లో ఇటీవల జరిగిన మరో ప్రమాదమరణంలో సంఘటన స్థలాన్ని ముందే శుద్ధి చేశారన్నది మీడియాకు బాగా తెలిసిన విషయం. ఆ పనిచేసిన టిడిపి ఎంఎల్ఎ పేరు కూడా చెప్పుకున్నారు. తమ్ముడి అంత్యక్రియలకు రవితేజ రాకపోవడంపై అధికారిక వివరణ లేదు గాని సోషల్మీడియాలో కొన్ని కథనాలు నడుస్తున్నాయి. ఈ సమయంలో నాకు రెండు మూడేళ్ల కిందట జరిగిన ఒక సంభాషణ గుర్తుకు వచ్చింది. అప్పుడే డ్రగ్స్ కేసులో అరెస్టులు జరిగాయి. దీని గురించి ప్రస్తావన వచ్చింది. ‘ అసలు హీరో కొద్దిలో తప్పించుకున్నాడు. ముందే కాస్త సమాచారం ఎలాగో అందినట్టుంది. లేకపోతే తననే బోనెక్కించేవాణ్ని’ అన్నారో పోలీసు కమిషనర్ ఆ సందర్భంలో ఒక సభలో కలిసినప్పుడు. ఫిలిం నగర్లో చాలామందికి మాదక ద్రవ్యాల వ్యవహారంతో సంబంధం వుందని కూడా ఆయన ధృవీకరించారు. ఈ కుటుంబం పేరు బయిటకు వచ్చింది గాని నిజానికి ఇంతకంటే పెద్ద కుటుంబం గురించి కూడా చెబుతుంటారు.అయినా మాఫియాలు మాదక ద్రవ్యాలు సినిమా పరిశ్రమలో కొందరికి పాత నేస్తాలేనని ఆ రోజున కమిషనర్ స్వయంగా నాతో చెప్పాక మరింత బాగా అర్థమైంది. కాకుంటే వారు తీసే చిత్రాల్లో మాత్రం ఈ ముఠాలను పట్టుకోవడం గొప్పగా చూపించేస్తుంటారు. అదే తమాషా