నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో చేశారు. తర్వాత షెడ్యూల్ కోసం కర్నాటక వెళ్లారు. అయితే చిత్రీకరణకు ఇచ్చిన అనుమతులను కర్ణాటక రాష్ట్ర మండ్య జిల్లా పాలన యంత్రాంగం రద్దు చేసింది.
మేలుకోట సమీపంలో వైన్ షాప్ సెట్ వేసి, వివిధ బ్రాండ్ల వైన్ సీసాలను ఉంచి చిత్రీకరణ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షరతులతో చిత్రీకరణకు అనుమతి ఇవ్వగా.. సినిమా యూనిట్ నిబంధనలను ఉల్లంఘించారంటూ స్థానిక కన్నడ సంఘాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.