తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం పదిన్నరకు మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుల జాబితాలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. ఆయన ప్లాన్‌తోనే దేవినేని అవినాష్ , అప్పిరెడ్డి అల్లరి మూకల్ని వేసుకుని వచ్చి దాడి చేశారని వైసీపీలో అందరికీ తెలుసు. అయితే అందర్నీ ఇరికించి ఆయన సేఫ్ అయిపోదామనుకున్నాడు. కానీ దొరికిపోయే పరిస్థితి వచ్చింది.
అసలు టీడీపీ ఆఫీసుపై దాడికి కారణం జగన్ ను బోషడికే అని తిట్టడం. అలా తిట్టింది పట్టాభిరామ్. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే తిట్టింది జగన్ ను కాదు.. సజ్జల రామకృష్ణారెడ్డిని. కానీ సజ్జల ప్లాన్ గా జగన్ ను తిట్టారంటూ తన చేతిలో ఉన్న మీడియా, సోషల్ మీడియాతో ప్రచారం చేయించి.. జగన్ కూ ఆదే చెప్పారు. జగన్ ఆ పట్టాభి మాట్లాడిన వీడియో చూశాడో లేదో కానీ.. తనను .. లం.. కొడకా అని తిట్టారని బహింగంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ ఆయన తీరు అంతే. అలా తిట్టినందున తన వాళ్లకు బీపీలు, షుగర్లు వచ్చి దాడి చేశారని సమర్థిస్తున్నారు. కానీ సజ్జల ట్రాప్ ను ఇంకా గుర్తించలేకపోతున్నారు.
ఇప్పుడు సజ్జల నుంచి ఆ మొత్తం కుట్రను బయటకు లాగనున్నారు. ఇప్పటికే చాలా మంది నుంచి అసలేం జరిగిందో వివరాలు సేకరించారు. ఏ వన్ నిందితుడు కూడా లొంగిపోయాడు. అయితే సజ్జల అందరిలాగే తనకు తెలియదు..గుర్తు లేదు అన్న సమాధానాలే చెప్పే అవకాశం ఉంది. కానీ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ప్రశ్నించనున్నారు.