రాజమండ్రిలో శ్రమదానంలో పాల్గొనేందుకు జననేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. పవన్ కళ్యాణ్ కి ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన నేపధ్యంలో రాజమండ్రిలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. రాజమండ్రి నగరాన్ని దాదాపు అష్టదిగ్భందనం చేశారు. వివరాల్లో కి వెళితే …
ఆంధ్ర లో రోడ్లు అధ్వానం గా ఉండడం పై పవన్ కొంత కాలంగా గళమెత్తుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దాదాపు ఆరు వారాల సమయం ఇచ్చి ఈ లోగా రాష్ట్ర వ్యాప్తంగా అద్వానంగా ఉన్న రోడ్లను మరమ్మతులు చేయకపోతే జనసైనికులే శ్రమదానం చేసి రోడ్లు బాగు చేసుకుంటారని కూడా ఇదివరకే హెచ్చరించారు. ఆ హెచ్చరిక మేరకు, ఇచ్చిన గడువు ముగియడంతో, ఈ రోజు రాజమండ్రి కి వస్తున్నారు. పవన్ పర్యటన నేపథ్యం లో రాజమండ్రి వైపు వచ్చే వాహనాలపై తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకునే దారులన్నీ పోలీసులు మూసివేశారు. సభకు ఇరు వైపులా సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాలినడకన కూడా కార్యకర్తలను సభా ప్రాంగణం వైపు వెళ్లనివ్వడం లేదు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి వాహనాలను సైతం లోనికి అనుమతించడం లేదు. దీంతో పాటు, పోలీసులు ఇప్పటికే వేలాది మంది జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు, నలుగురు కలసి ఒక చోట ఉన్నా, నడిచి వెళ్తున్నా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపధ్యంతో రాజమండ్రి నగరాన్ని తీవ్ర ఆంక్షలతో అష్టదిగ్భందనం చేశారు.
మొత్తం మీద చూస్తే పవన్ పర్యటన ను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం , పోలీసులు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే ప్రజలు మాత్రం ఆ కసరత్తు ఏదో రోడ్లు బాగు చేయడం పై పెట్టి ఉంటే బాగుండేది అని పెదవి విరుస్తున్నారు.