వైసీపీ హయాంలో అమరావతిలో రోడ్లను తవ్వి మట్టి దోచుకుపోతున్నారని ఆరోపణలు వచ్చేవి. పోలీసులు చూసీ చూడనట్లుగా ఉంటున్నారని అందుకే ఇలాంటివి జరుగుతున్నాయని టీడీపీ నేతలు మండిపడేవారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికీ అలాంటి ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా అమరావతి ప్రాంతంలో పదేళ్ల కిందట వేసిన రోడ్లను తవ్వి మట్టిని తీసుకుపోతున్నారని.. రెండు రోజలుగా ఇలా జరుగుతోందని బయటకు వచ్చింది. రాజధాని రైతులు రోడ్డును తవ్వి మట్టి తీసుకుపోతున్న ప్రాంతానికి వెళ్లి బయటపెడితేనే అందరికీ తెలిసి.
ఆ మట్టి తవ్వుకుంటున్న వారు ఎవరో అందరికీ తెలుసు. గతంలోతవ్వుకున్న వారు కూడా ఎవరోతెలుసు. అయినా పోలీసులు మాత్రం పట్టించుకోవడంలేదు. గతంలో పట్టించుకోలేదు అంటే సరే ఇప్పుడు కూడా అలా తవ్వుతున్నారని ఆరోపణలు రావడం ఖచ్చితంగా చేతకానితనమే అవుతుంది. ఓ వైపురాజధాని పనుల్ని ప్రారంభించేదుకు టెండర్లు పిలుస్తున్న సమయంలో ఇలా.. ఓ వైపు రోడ్లను కూడా తవ్వేసుకుంటున్నారంటే.. వ్యవస్థలపై వారికి ఇంకా ఏ మాత్రం భయం ఏర్పడలేదని అర్థం. సీఆర్డీఏ అధికారులు.. పోలీసులు ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకుంటే.. రాజదాని వనరులపై చేయి వేయడానికి ఇతరులు భయపడేలా చేయాలని కోరుతున్నారు.
అమరావతిలో ఇలాంటివి జరిగితే గత ప్రభుత్వానికి అమరావతి అంటే ఇష్టం లేదు కాబట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించిందని అనుకోవచ్చు. కానీ ప్రస్తుత ప్రభుత్వానికి అమరావతి అత్యంత ముఖ్యం. అయితే మాటల్లోనే కాదు.. చేతల్లోనూ ఇలాంటి ప్రయారిటీని చూపించాల్సి ఉంది. అమరావతిలోఇంకా రోడ్లు తవ్వుతున్నారన్న ఘటనలు జరిగితే.. అలాంటి చేతలను ప్రజలు హర్షించే అవకాశం ఉండదు.