ఫిబ్రవరి రెండో తేదీన అర్థరాత్రి లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తాము వెంటనే ఐటీ గ్రిడ్‌పై చర్యలు తీసుకున్నామని… తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. నిజానికి ఐటీ గ్రిడ్ సంస్థపై.. గత నెల 23వ తేదీనే… పోలీసులు దాడి చేశారు. ఎందుకు చేశారు..? ఏం చేశారు..? అన్నదానిపై పోలీసులు ఇంత వరకూ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సైబరాబాద్ కమిషనర్ .. అచ్చంగా రాజకీయ వేత్త తరహాలో చేసిన ప్రకటనలోనూ.. గత నెల ఇరవై మూడున.. ఐటీ గ్రిడ్ సంస్థలో సోదాలు చేశామని చెప్పలేదు. కానీ … ఇప్పుడు.. ఆ సంస్థకు చెందిన సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. కార్యాలయంలో.. పోలీసులు ఉద్యోగుల్ని ప్రశ్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఐటీ గ్రిడ్ సంస్థకు సంబంధించి ఎఫ్ఐఆర్ రెండో తేదీన నమోదైతే.. అంతకు ముందే ఇరవై మూడో తేదీనే… ఆ సంస్థపై పోలీసులు ఎందుకు దాడి చేశారనే ప్రశ్న ఇప్పుడు.. కలకలం రేపుతోంది. టీడీపీకి చెందిన కీలక సమచారం.. రాబట్ట డానికే… పోలీసులు ఈ దాడి చేశారని.. అప్పట్నుంచి పోలీసులు వేధిస్తున్నారని ఐటీ గ్రిడ్ ఉద్యోగులు చెబుతున్నారు. అసలు ఫిర్యాదు ఎప్పుడు వచ్చింది..? ఎవరు చేశారు..? ఫిబ్రవరి 23నే పోలీసులు ఎందుకు సోదాలు చేయాల్సి వచ్చింది..? ఏ సమాచారంతో సోదాలు చేశారు..? ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారన్నది… ఆసక్తికరంగా మారింది.
పోలీసులు కొత్తగా ఓ వింత వాదన తీసుకొస్తున్నారు.. అదేమిటంటే.. తాము గతంలోనే ఐటీ గ్రిడ్ సంస్థ యజమానిని పిలిపించి ప్రశ్నించామని.. ఆ తర్వాత ఆయన సర్వర్ల నుంచి సమాచారం తొలగించారని చెబుతున్నారు. అసలు ఫిర్యాదే రెండో తేదీన చేస్తే.. అంతకు ముందు అశోక్‌ను ఎలా పిలిపించారు..? అన్న బేసిక్ పాయింట్‌ను మర్చిపోయారు. అప్పటికే ఏవరైనా ఫిర్యాదు చేసి ఉంటే.. ఆది, సోమవారాలు కోర్టుకు సెలవులు చూసుకుని శనివారం కోర్టు సమయం ముగిసిన తర్వాతే ఎందుకు ఆ సంస్థపై దాడి చేసి.. హార్డ్ డిస్కులు, సీపీయూలు, ల్యాప్‌ట్యాప్‌లు పట్టుకెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు అత్యంత అరాచకంగా ప్రవర్తించారన్న విషయం స్పష్టమయింది. మరి పోలీసులు ఎలా సమర్థించుకుంటారో మరి..!