హైదరాబాద్ లోని కొంపల్లి లో ఒంటేరు ప్రతాపరెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రతాప్ రెడ్డి ఇంటి పై పోలీసులు దాడి చేయడంతో కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఒకానొక సమయంలో ఒంటిమీద పెట్రోల్ పోసుకుని ప్రతాపరెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
గజ్వేల్ నియోజకవర్గం లో కెసిఆర్ మీద పోటీ చేస్తున్న ఒంటేరు ప్రతాపరెడ్డి గత కొంత కాలంగా వార్తల లో నిలుస్తున్నారు. ఇటీవలే ప్రతాప్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేయడం దాన్ని పోలీసులు భగ్నం చేయడం తెలిసిందే. గత కొద్ది కాలంగా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, తనను వేధిస్తున్నారని ప్రతాపరెడ్డి కెసిఆర్ ఫై విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ రోజు సోదాల పేరిట పోలీసులు ప్రతాపరెడ్డి ఇంటి పైకి రావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఒంటి మీద పెట్రోలు తో కనిపించిన ప్రతాపరెడ్డి, తాను ఆత్మహత్యా యత్నానికి పాల్పడ లేదని, తన పై పోలీసులే పెట్రోల్ పోశారని, తన హత్యకు కే సి ఆర్ కుట్ర చేశారని ప్రతాప రెడ్డి ఆరోపించారు.
డౌన్ డౌన్ కెసిఆర్ నినాదాలతో ప్రతాపరెడ్డి ఇంటివద్ద ప్రాంతమంతా మార్మోగింది. ప్రతాపరెడ్డి కార్యకర్తలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మొత్తానికి ప్రతాపరెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.