వాహనాలకు ఉన్న బ్లాక్ స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించాలని కోర్టు ఆదేశాలు ఎప్పటి నుంచో వున్నాయి. మహిళలపై లైంగిక దాడులు, దొంగతనాలు, కిడ్నాపులకు పాల్పడేవారు ఈ బ్లాక్ ఫిల్మ్ వున్న వాహనాలు ఉపయోగించి తప్పించుకున్నట్లు పలు విచారణలులో తేలడంతో కోర్టు సదరు ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయంలో తాజాగా తెలంగాణ పోలీసులు కాస్త గట్టిగానే తనిఖీలు చేస్తున్నారు. బ్లాక్ ఫిల్మ్ వాడుతూ ఎవరు దొరికిన అక్కడికక్కడికే అవ తొలగించి ఫైన్ వేస్తున్నారు. ఇటీవల మంచు మనోజ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్ కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌లను పోలీసులు తొలగించి ఫైన్ వేసిన సంగతి తెలిసిందే.
తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఫైన్ లిస్టు లో చేరారు. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేసిన పోలీసులు.. అటుగా వెళ్తోన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుని ఆపారు. ఆయన కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించి జరిమనా విధించారు. ఆ సమయంలో త్రివిక్రమ్ కారులోనే ఉన్నారు. ఈ విషయంలో పోలీసులకు ఆయన సహకరించారు. అయితే కొన్ని రోజులుగా ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్న ఘటనలు వెలుగుస్తున్నప్పుడు స్వచ్చందంగా బ్లాక్ ఫిల్మ్ ని తలగించకోకుండా ఇలా ఫైన్ వరకూ తెచ్చుకోవడం గమనార్హం.