“డ్యూటీకి త్వరగా రమ్మన్నారని డ్రైవర్ చావగొట్టాడు. ఈ లేఖ రాయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. డ్రైవర్ ప్రసాద్‌ను వదలొద్దు.. ఇట్లు వివేకానందరెడ్డి…! అనే మ్యాటర్ ఉన్న లేఖను… వైఎస్ కుటుంబీకులకు.. పోలీసులకు ఇచ్చారు. అది కూడా.. సాయంత్రం జగన్ … పులివెందుకు చేరుకున్న తర్వాతనే. మీడియాతో మాట్లాడటానికి పది నిమిషాల ముందునే. పోలీసులకు … వైఎస్ కుటుంబీకులు..ఆ లెటర్ ఇస్తే.. జగన్ మాత్రం.. పోలీసులు తనకు చూపించారంటూ… మార్చి చెప్పారు. దాంతో.. ఆ లెటర్ కేంద్రంగానే.. ఇప్పుడు.. అసలు చిక్కుముడి వీడిపోయే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
గొడ్డలితో నరికి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి ఎలా ఈ లేఖ రాయగలుగుతారు..? జగన్ చెప్పినట్లు గొడ్డలితో దారుణంగా నరకడంతో తీవ్ర గాయాలపాలైన వివేకా లెటరు రాసే పరిస్థితిలో ఉన్నాడా అనేది సందేహమే. మరి వివేకా బంధువులే ఈ లెటరును తీసుకువచ్చి పోలీసులకు అందించడం వెనుక అంతరార్థం ఏమిటన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఉదయం గుండెనొప్పితో చనిపోయారని చెప్పడం, ఆ తరువాత పోస్టుమార్టానికి తరలించే సమయంలోనే గొడ్డలితో నరికినట్లు గుర్తించారు. బెడ్రూంలో ఉన్న రక్తపు మరకలు తుడవడం ఇవన్నీ కూడా పోలీసులు వచ్చే లోపే వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అన్నది ఈ కేసులో కీలకంగా మారింది. ఈ లేఖను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి అసలు వైఎస్ వివేకానే ఈ లేఖ రాశాడా ..? లేక ఇంకెవరైనా రాశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
వివేకా మృతి గురించి పోలీసులకు ఉదయం ఏడు గంటల తర్వాతే తెలిసింది. సీఐ శంకరయ్య సంఘటన స్థలానికి చేరే సమయానికే రక్తాన్ని తుడుస్తూ కనిపించడంతో ఆయన ఇలా చేయకూడదంటూ అడ్డు తగిలారు. సాయంత్రం వరకు హైడ్రామా కొనసాగుతూ వచ్చింది. డీఐజీ, ఎస్పీతో పాటు క్లూస్‌టీం, జాగిలాలు తదితర విచారణ బృందాలన్నీ తరలివచ్చాయి. సాయంత్రం ఐదు గంటల సమయంలో… జగన్ పులివెందుల చేరుకున్నారు. జగన్ మీడియా సమావేశం పెట్టే ముందు వివేకానందరెడ్డి బంధువులు డీఎస్పీ నాగరాజును కలిసి ఇంట్లో ఈ లేఖ దొరికిందంటూ ఓ లేఖ అందించారు. ఆ లేఖలో రక్తపు మరకలు ఉన్నాయి. పోలీసులు డ్రైవర్‌తో పాటు సుధాకర్ రెడ్డి అనే రాజారెడ్డి హత్య కేసు నిందితుడ్ని ప్రశ్నిస్తున్నారు.