జెత్వానీ కేసులో అప్రూవర్లుగా పోలీసులు !

హీరోయిన్ జెత్వానీపై పక్కాగా తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశామని పోలీసులు అనుకుంటున్నారు కానీ… తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ఓ భ్రమలో అనేక తప్పులు చేశారు. అందులో మొదటిది ముందుగానే విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవడం. జెత్వానీపై ఉదయం కేసు వస్తే సాయంత్రం… బెటాలియన్ ను తీసుకునే వెళ్లిపోయారు విశాల్ గున్ని సహా ఇతర అధికారులు. ఓ మహిళను.. అదీ కూడా రూ. ఐదు లక్షల చీటింగ్ కేసులో అరెస్టు చేయడానికి దాదాపుగా రెండు లక్షలు పెట్టి ఫిర్యాదు అందడానికి ముందు రోజే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అది రికార్డెడ్.

ముంబైలో వారు ఉన్న హోటల్.. తిరిగిన కార్ల గురించి పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చింది. జెత్వానీ పోలీసు అధికారులపై ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి నివేదికను డీజీపీకి సమర్పించారు. ఇందులో తప్పుడు ఫిర్యాదులు చేయించి తప్పుడు కేసులు పెట్టించారని ఆధారాలతో సహా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. విద్యాసాగర్ చెప్పిన వ్యక్తి తమకు జెత్వానీ భూమి అమ్మలేదని చెప్పడం, ఫిర్యాదు కంటే ముందే ముంబైకి టిక్కెట్లు చేసుకోవడం.. జెత్వానీ పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడంతో పాటు విజయవాడలో అనధికారికంగా నిర్బంధించి వేధించడం వరకూ అన్ని అంశాలనూ ఆ నివేదికలో అందించారు.

ఈ నివేదిక ప్రకారం పీఎస్ఆర్ ఆంజనేయలు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై కేసులు నమోదు చేసి తీవ్రమైన అభియోగాలు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వారికి అతిపెద్ద మైనస్ ఏమిటంటే… ఈ ఐపీఎస్ అధికారులతో పాటు ఈ తప్పుడు కేసులో భాగమైన వారంతా… అసలేం జరిగిందో చెప్పేయడం. వారంతా అప్రూవర్లుగా మారిపోవడం. వారు చేసిన తప్పుడు పనులకు తాము బలి కావాలనుకోవడం లేదని వారు తేల్చేసుకున్నారు. దీంతో ఈ దారి తప్పి ఐపీఎస్‌లకు ఎండ్ కార్డ్ పడేందుకు మార్గం సుగమం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణ తల్లి విగ్రహం – కేటీఆర్‌ ఆన్సర్ ఏది ?

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామని కేటీఆర్ ప్రకటంచి.. గొప్పగా బెదిరించానని అనుకుంటున్నారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అప్పుడు కాంగ్రెస్ తో పొత్తులో ఉంటే......

తగ్గుతున్న జగన్ భయం – ఏపీలో పెట్టుబడుల వెలుగులు !

ఐదేళ్ల అరాచక నీడ నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఎవరైనా రూపాయి పెట్టుబడితో రావాలంటే వణికిపోయే పరిస్థితి నుంచి మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెడితే బెటరన్న ఆలోచనలకు పెట్టుబడిదారులు వస్తున్నారు. గుజరాత్...

బెజవాడ ప్రజలకు తోడు, నీడగా ప్రభుత్వం !

బుడమేరు ఉగ్రరూపం కారణంగా నష్టపోయిన బెజవాడ వాసులందరికీ ఆర్థిక పరమైన మద్దతు ఇవ్వడానికి చంద్రబాబు భారీ ప్యాకేజీ ప్రకటించారు. ముంపు ప్రాంతంలోని ప్రతి ఇంటికి ఆయన పరిహారం ప్రకటించారు. ప్రతి ఒక్క కుటుంబానికి...

ఇండస్ట్రీ #MeToo : నాణేనికి మరో వైపు లేదా !?

సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా మహిళా ఆర్టిస్ట్ లేదా టెక్నిషియన్ ఫలానా వారు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు చేస్తే ప్రపంచం బద్దలైపోయినంత ప్రచారం వస్తుంది. అది సినీ ఇండస్ట్రీకి ప్రజల్లో ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close