సంధ్యా ధియేటర్ తొక్కిసలాట వివాదం ఈ ఆదివారం పోలీస్ వర్సెస్ పుష్ప అన్నట్లుగా మారింది. సినిమాలో పోలీసుల్ని చూపించిన విధానంతో వారిలో అంతర్గతంగా ఫైర్ ప్రారంభమయిందేమో కానీ.. ఈ వ్యవహారంలో మొత్తం నింద డిపార్టుమెంట్ వేస్తున్నారని అర్థమైపోగానే అలర్ట్ అయిపోయారు. ఫలితంగా పుష్ప వర్సెస్ పోలీస్ గా సీన్ మారిపోయింది.
హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు వినిపించేటప్పుడు అర్జున్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి .. పోలీసులపై వేసిన వంగ్యాస్త్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన పోలీసులకు రక్తం మరిగిపోయి ఉంటుంది. తాజాగా అల్లుఅర్జున్ ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు అనుమతి ఇచ్చారని.. తననువెళ్లిపోవాలనిఏ పోలీసు అధికారి చెప్పలేదని పైగా.. తాను వస్తూంటే వాళ్లే రూట్ క్లియర్ చేశారని కూడా చెప్పుకొచ్చారు. ఆ ఆరోపణలో పోలీస్ డిపార్టుమెంట్లో ఆగ్రహం ఒక్క సారిగా భగ్గుమంది.
సస్పెన్షన్ లో ఉన్న ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేం తల్చుకుంటే ఇక్కడ ఉండలేరని హెచ్చరించారు. తర్వాత ఏకంగా పోలీస్ కమిషనరే ప్రెస్ మీట్ పెట్టారు. అర్జున్ చేసిన వ్యాఖ్యన్నీ తప్పు అని చెప్పి ఆధారాలు బయట పెట్టారు. నిజానిక అర్జున్ తన తప్పేం లేదని చెప్పుకోవడానికి కొన్ని ప్రివిలేజెస్ తీసుకున్నారు. తనకు అనుకూలంగా వాదనలు వినిపించుకున్నారు. తన ఇమేజ్ కు దెబ్బపడుతోందని బాధపడ్డారు.
కానీ నీ ఇమేజ్ సంగతి సరే..డిపార్టుమెంట్ ఇమేజ్ సంగతేమిటని.. పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పుడీ ఇష్యూలో.. అర్జున్ రాజకీయ నేతలతో పెట్టుకున్నది కాక.. పోలీసులతోనూ పెట్టుకున్నారు. తాత్కలికబెయిల్ తప్పించిన నిరంజన్ రెడ్డి భవిష్యత్ లో దిద్దుకోలేనంత నష్టం చేశారు. లీగల్ టీమ్ .. లీగల్ టీమ్ కలవరించిన అల్లు టీం.. ఇప్పుడు ఆకులు పట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేతులు కాల్చుకుంది.