ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. తెలంగాణ ప్రచారంలో పాల్గొన్న రెండు సభల్లో… కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య సంబంధాన్ని అటంగట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. అధికారం కోసం హోరాహోరీగా తలపడుతున్న రెండు పక్షాలు ఒక్కటేనన్న అభిప్రాయం కలిగించి.. తన పార్టీకి లాభం చేద్దామన్న ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్, టీఆర్ఎస్ డూప్ ఫైటింగులు చేస్తున్నాయని చెప్పలేదు. రహస్య మిత్రపక్షం.. టీఆర్ఎస్కు వీలైనంత సాయం చేసి.. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికే.. ఆయన తన ప్రచార వ్యూహన్ని ఖరారు చేసుకున్నారు. అందుకే.. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాకుండా చేయండి.. అని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు జాతీయ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి గెలిస్తే.. కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికలకు కొత్త ఉత్సాహం వస్తుంది. దేశమొత్తం ఓ పాజిటివ్ వేవ్ వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి. అందుకే.. బీజేపీ… టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నట్లుగా.. నటిస్తోంది. దానికి కారణం.. ఇప్పటికే టీఆర్ఎస్ పై ఉన్న. .. లోపాయికారీ ఒప్పందాల ముద్ర వల్ల.. మైనార్టీ ఓటర్లు దూరమవుతున్నారని ప్రచారం జరగడమే. దీనికి సంబంధించిన స్పష్టమైన నివేదికలు ఉండటంతో… రెండు పార్టీలు.. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైటింగ్ ప్రారంభించాయనేది అసలు విశ్లేషణ. ముస్లిం ఓటర్లు .. పాతబస్తీ మినహా ఇతర చోట్ల.. సంప్రదాయకంగా.. కాంగ్రెస్ పార్టీ ఓటర్లు. ముస్లిం గుర్తు లేకపోతే.. వారు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారు. ఈ సారి… టీఆర్ఎస్ బీజేపీతో ఉన్న కారణంగా.. మజ్లిస్ చెప్పినా.. వారు ఓటు వేసే పరిస్థితి లేదన్నది తాజా సర్వేల సారాంశం.
ఈ కారణంగానే.. భారతీయ జనతా పార్టీ… వ్యూహం ప్రకారం.. ముస్లింల ఓట్లు… టీఆర్ఎస్కు వెళ్లాలంటే.. ఆ పార్టీని విమర్శించడం.. దానికి రివర్స్‌లో.. కేసీఆర్ తొడకొట్టడం జరిగితే.. రెండింటి మధ్య మంచి ఫైట్ జరుగుతుందన్న భావన వస్తుంది. మోడీకి సపోర్ట్ చేసే ప్రశ్నే లేదని.. కేసీఆర్ పదే పదే చెప్పడానికి కూడా ఇదే కారణమని అంటున్నారు. మొత్తానికి.. తెలంగాణ ఎన్నికల్లో ఆశలే లేని బీజేపీ.. తను గెలవడం సంగతేమో కానీ.. టీఆర్ఎస్ ను గెేలిపించడానికి రివర్స్ ఇంజినీరింగ్ చేయడానికి వెనుకాడటం లేదు. దీని కోసం మోదీ సైతం రంగంలోకి దిగారు.