వైసీపీ వేధింపులవల్లే రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని లేఖ రాసిన వంశీకి చంద్రబాబు … పోరాడాలని సూచిస్తే… ఓ ప్రత్యుత్తరం రాశారు. దానికి వంశీ… తన బాధలు తెలియజేస్తూ…కృతజ్ఞతలు తెలియజేస్తూ..మరో ఉత్తరం రాశారు. చంద్రబాబు.. ఇంతటితో వదిలి పెట్టలేదు. వెంటనే.. వంశీకి మరో లేఖ రాశారు. గతంలో మీరు చేసిన పోరాటాలను.. గుర్తించామని.. పార్టీ కూడా అండగా నిలబడిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా.. పోరాడాలని.. సమస్యలపై పోరాడాలని సలహా ఇచ్చారు. మీ సమస్యలపై కేశినేని నాని, కొనకళ్ల నారాయణతో మాట్లాడాలని.. లేఖలో చంద్రబాబు సలహా ఇచ్చారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడదామని సూచించారు.
టీడీపీ నేతలు కూడా… వంశీకి మీడియా ముఖంగా… సూచనలు చేయడం ప్రారంభించారు. వంశీని వదులుకోవాలని చంద్రబాబుకు లేదని… ఆయన కేశినేని నాని, కొనకళ్ల నారాయణలతో చర్చించవచ్చని సూచిస్తున్నారు. మరో వైపు.., ప్రస్తుతానికి తాత్కాలికంగా… రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లుగా ఉన్నా.. కొద్ది రోజుల తర్వాత వైసీపీలో చేరాలనుకుంటున్న వల్లభనేని వంశీ.. టీడీపీ అధినేత వ్యూహం.. చిక్కుల్లో పడేస్తోంది. తాను వేధింపుల వల్లే.. రాజకీయాలకు దూరమవుతున్నానని లేఖ రాయడంతో.. ఆ వేధింపులపై పోరాడాలి కానీ.. వెళ్లి ఆ పార్టీలో ఎలా చేరుతారనే ప్రశ్నలు వంశీకి ఎక్కువగానే వస్తున్నాయి. దీంతో.. లేఖల వ్యూహం.. వంశీకి ఎదురుకొట్టినట్లయిందన్న ప్రచారం జరుగుతోంది.
మరో వైపు.. వంశీని ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలోకి రానివ్వకూడదన్న లక్ష్యంతో గత ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. ఆయన వైసీపీ కార్యకర్తలను వేధించారని.. సీఎం జగన్ కు ఫిర్యాదు చేయబోతున్నారు. జగన్ ఈ రోజు యార్లగడ్డకు సమయం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో కార్యకర్తలను తీసుకుని జగన్ వద్దకు యార్లగడ్డ వెళ్లనున్నారు. ఉపఎన్నికలు వచ్చినా.. వంశీ.. వైసీపీకే పని చేస్తారని… ఆయనకు టిక్కెట్ ఉండదని.. ఇప్పటికే వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో యార్లగడ్డ.. మెత్తబడే అవకాశాలే ఉన్నాయంటున్నారు.