రాహుల్ గాంధీ లోక్‌సభలో తన ప్రసంగంతో.. బీజేపీ సభ్యులకు మంట పుట్టించారు. రాహుల్ ప్రసంగం దెబ్బకు సభ ఓ సారి వాయిదా పడింది. సూటిగా సుత్తి లేకుండా.. తన ప్రసంగాన్ని ప్రారంభించి ముగించారు రాహుల్. ఆంధ్రప్రేదశ్ అంశాన్ని ప్రారంభంనే ప్రస్తావించారు. రాజ్యసభ నాటి ప్రధాని ఇచ్చిన హామీకి విలువ లేదా అని ప్రశ్నించారు. అంతా బాగానే ఉన్నా ప్రసంగం ముగించే ముందు నా మీద మీలో కోపం, ద్వేషం ఉన్నాయి నేను వాటిని తొలగిస్తానంటూ ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నేరుగా మోడీ వద్దకు వెళ్లారు. రాహుల్ ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. తన దగ్గరకు వచ్చిన రాహుల్ కు మోడీ షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు. కానీ రాహుల్ తీసుకోలేదు. కానీ కూర్చుని ఉన్న మోడీని హగ్ చేసుకుని..నవ్వుకుంటూ తన సీటు వద్దకు వెళ్లబోయారు. అయితే ప్రధాని మోడీ మళ్లీ రాహుల్ ను వెనక్కి పిలిచి… భుజం తట్టి పంపించారు.
రాహుల్ ఏ ఉద్దేశంతో హగ్ చేసుకున్నారన్నదానిపై విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. రాహుల్ గాంధీ… ప్రధాని మోదీ.. “హగ్ప్లొమసి”పై ప్రాక్టికల్ సెటైర్ వేశారని భావిస్తున్నారు. ప్రధాని మోదీ.. ఏ దేశానికి వెళ్లినా.. ఆ దేశ అధ్యక్షులను.. ఆత్మీయంగా అలింగనం చేసుకుంటారు. ఎవరైనా వచ్చినా అంతే. అలాగే తనకు బాగా దగ్గరైన వారు వచ్చినా మోడీ ఆలింగనం చేసుకుంటారు.
అందుకే దీనికి రాహుల్ గాందీ “ఆలింగన దౌత్యం” అనే పేరు పెట్టారు. పాకిస్థాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నడు.. చైనాతో డొక్లాం గొడవ వచ్చినప్పుడు..” మోడీ గారూ త్వరపడండి. హగ్ప్లొమసి విఫలమైంది. అర్జెంట్‌గా మరిన్ని ఆలింగనాలు కావాలి” అని సెటైర్లు వేశారు.
రాహుల్ ఇలాంటి ట్వీట్లు చేసి ..మోడీ చేయడానికి కొన్ని ఇతర కారణాలు కూడా “కశ్మీర్లో పెచ్చరిల్లుతున్న సమస్యలను తుడిచిపెట్టేందుకు ఒక్క ఆత్మీయ ఆలింగనం చాలు” అంటూ గతంలో ప్రసంగాల చేశారు. మోడీకి అలింగనానికి ఏదో లింక్ ఉందనున్న రాహుల్.. తన ప్రసంగం ముగించిన తర్వాత ఓ హగ్ ఇచ్చారు. నిజానికి ఒక్క ఆత్మీయ ఆలింగనం.. మనుషుల మధ్య శత్రుభావం తగ్గిస్తుందని మానసిక నిపుణులు కూడా ఎప్పుడో చెప్పారు. తన ప్రసంగంలో రాహుల్ తనను పప్పు..అని అసమర్థుడని..ఎన్నెన్నో బీజేపీ నేతలు అంటూ ఉంటారని.. కానీ తను మాత్రం ఉండనని…నిరూపించేందుకు.. మోదీకి అర్థమయ్యేలా “ఆలింగనం” షాక్ ఇచ్చినట్లు భావించొచ్చు.