విశాఖ ఎంపీ స్థానంలో జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచిన.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ.. తాను చేస్తానని చెప్పిన హామీలతో.. ఓ బాండ్ రాసిచ్చారు. ఏపీలో కొంత మంది అదే పని చేశారు. అవన్నీ… తమను గెలిపిస్తే.. ప్రజలకు ఏం చేస్తామో.. చెప్పే హామీలు.. ఆ బాండ్లలో ఉన్నాయి. తెలంగాణలో కరీంనగర్ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న పొన్నం ప్రభాకర్ కూడా.. ఓ బాండ్ రాశారు. కానీ.. ఆయన తాను ఫలానా హామీని సాధిస్తానని అందులో చెప్పలేదు. కేవలం పార్టీ మారబోనని.. పార్టీ మారితే క్రిమినల్ కేసు పెట్టాలని.. ఆ బాండ్లో రాసిచ్చారు. “ఎవర్నీ గెలిపించినా టీఆర్ఎస్లో చేరుతున్నారని.. నిన్ను గెలిపించినా అదే పని చేస్తావా?” అని కొన్ని చోట్ల ప్రజలు ప్రశ్నించినందుకే.. ఈ బాండ్ ఇస్తున్నట్లు పొన్నం చెబుతున్నారు. పార్టీ వీడితే తనపై చట్టరీత్యా చర్యలు తీసుకునే హక్కును ప్రజలకు కల్పిస్తున్నానని ప్రకటించారు.
ఇటీవలి కాలంలో.. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు.. పట్టుమని వంద రోజులు కాక ముందే టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇలాంటి వారిలో.. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి లాంటి వారు కూడా ఉన్నారు. అధికార పార్టీ నుంచి వచ్చే బెదిరింపులు, ప్రలోభాలు లాంటివాటిని సమర్ధంగా ఎదుర్కోలేక… సొంత పార్టీని డంప్ చేసి.. గులాబీ కండువా కప్పేసుకుంటున్నారు. దీంతో ప్రజల్లో కూడా.. ఓ రకమైన నిర్వేదం కనిపిస్తోంది. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా తీర్పిస్తే… వెళ్లి అదే పార్టీలో చేరడం ఏమిటన్న ప్రశ్న వారిని వేధిస్తోంది. అందుకే.. ఓటింగ్ పైనా… చాలా మందిలో నిరాసక్తత కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రతిపక్షాలు ఉండకూడదని.. తెలంగాణ అంటే.. టీఆర్ఎస్ మాత్రమే ఉండాలన్నట్లుగా.. ప్రస్తుతం.. రాజకీయం నడుస్తోంది. అందరూ తమ పార్టీలోకి వచ్చి చేరాలని కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. ప్రజాప్రతినిధుల్ని అన్ని రకాలుగా… లొంగ దీసుకుంటున్నారు. ప్రజల్లో ఈ అసంతృప్తి.. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే బయటపడింది. మండలిలో కాంగ్రెస్కు ప్రాతినిధ్యం లేకుండా చేయడానికి… చేసిన ప్రయత్నాలను.. పట్టచభద్రులు తిప్పికొట్టారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడిన జీవన్ రెడ్డిని.. ఎమ్మెల్సీని చేశారు. కాంగ్రెస్ లోనే ఉంటామని.. గట్టిగా చెప్పే అభ్యర్థులకు.,. తెలంగాణ ప్రజలు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న అభిప్రాయం .. పొన్నం లాంటి నేతల బాండ్లతో తేలిపోతోంది.