పరిటాల – జేసీ వర్గాలు ఒకే పార్టీలో ఉంటాయని ఎవరైనా ఊహించారా..?
జమ్మలమడుగులోని రెండు వర్గాలు కలుస్తాయని అంచనాలున్నాయా…?
కోట్ల – కేఈ కుటుంబాలు కర్నూలులో ఒకే జెండా కింద ఉంటాయని అనుకున్నారా..?
ఈ మూడు మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో…దశాబ్దాలుగా రాజకీయం పోరాటంతో శత్రువులుగా మారిన ఎన్నో కుటుంబాలను.. చంద్రబాబునాయుడు తన చాణక్యంతో రాజకీయంగా ఒక్కటి చేశారు.
సీమలో ఫ్యాక్షన్ కుటుంబాల్ని కలిపిన చంద్రబాబు చాణక్యం..!
ఆదినారాయణరెడ్డి – రామసుబ్బారెడ్డిలను… ఒకే వేదికపై చూస్తారని కూడా … జమ్మల మడుగు రాజకీయాలపై అవగాహన ఉన్న వారు ఎవరూ అనుకోరు. కానీ వారిద్దరు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కలిసి ప్రచారం చేస్తున్నారు. ఒకరి గెలుపు బాధ్యతను మరొకరు తీసుకున్నారు. జేసీ దివాకర్ రెడ్డి – పరిటాల సునీతలు ఒకే పార్టీలో ఉంటారని.. గత ఎన్నికల ముందు ఎవరైనా ఊహించారా..?. జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి – రామసుబ్బారెడ్డిల మధ్య ఎంత వైరం ఉందో.. అనంతపురం జిల్లాలో జేసీ – పరిటాల వర్గాల మధ్య అంత కంటే ఎక్కువ వైరం ఉంది. వీరిద్దరూ ఒకే పార్టీలో ఉంటారని.. ఎవరూ ఊహించలేదు. కానీ అది నిజమయింది. గత ఐదేళ్లుగా… ఆ రెండు వర్గాలు కలిసే.. అనంతపురంలో రాజకీయాలు చేస్తున్నాయి. ఇప్పుడు కోట్ల – కేఈ … కూడా.. కలసి రాజకీయాలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో దశాబ్దాలుగా రాజకీయ వైరంతో పోట్లాడుకున్న కోట్ల – కేఈ కుటుంబాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కలసి రాజకీయాలు చేస్తున్నాయి. అభ్యర్థులపై కలిసి నిర్ణయం తీసుకుంటున్నారు. ఒకరికొకరు సాయం అందించుకుంటున్నారు. ఫ్యాక్షన్ అంత లేకపోయినా… నారా రాజకీయానికి.. నల్లారి రాజకీయానికి అసలు సరిపడేది కాదు. కానీ.. ఇప్పుడు నల్లారి కుటుంబాన్ని కూడా.. టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు.
కోస్తా, ఉత్తరాంధ్రలో మిత్రులైన రాజకీయ శత్రవులు..!
కోస్తా నుంచి ఉత్తరాంధ్ర వరకు.. ఇలా వేర్వేరు పార్టీల్లో శత్రువర్గంగా మారిన కుటుంబాలు .. ఇప్పుడు టీడీపీ గూటికి చేరి ఒక్కటయ్యాయి. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి – కరణం వర్గాల మధ్య ఫ్యాక్షన్ చిచ్చు కూడా ఉంది. ఇప్పుడు వారు కూడా ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. ఇద్దరికీ సీట్లు కేటాయింపు జరగడంతో.. ఎక్కడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం లేదు. విజయవాడలో వంగవీటి, దేవినేని వర్గం మధ్య ఉండే తగాదాలు… చరిత్రలో చెరపలేని విధంగా ఉన్నాయి. ఇప్పుడు… దేవినేని అవినాష్… గుడివాడ నుంచి పోటీ చేస్తున్నారు. వంగవీటి వారసుడు కూడా టీడీపీలో చేరారు. ఆయనను ప్రత్యక్ష ఎన్నికల్లో ఏదో ఓ చోట నుంచి పోటీ చేయించాలనే ఆలోచన చేస్తున్నారు. ఇక ఉత్తరాంద్రలో బొబ్బిలి రాజులు, విజయనగరం రాజుల మధ్య శతృత్వం ఇప్పటిది కాదు. కానీ ఇద్దరు ఇప్పుడు కలిసి టీడీపీలోనే రాజకీయాలు చేస్తున్నారు. ఇక వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, శత్రుచర్ల విజయరామరాజు కుటుంబాల మధ్య అంతే వైరం ఉంది. రెండు కోటల పేర్లో వీరి మధ్య గొడవలు ఉండేవి. ఇప్పుడు ఇద్దరూ టీడీపీలోనే ఉన్నారు.
విభజించిన పాలించడం అనే రాజకీయానికి చంద్రబాబు దూరం..!
సాధారణంగా జిల్లాను లేదా.. .నియోజకవర్గాన్ని శాసించగలిగే స్థితిలో ఉండే ఇద్దరు నేతలు వేర్వేరు పార్టీల్లో ఉంటారు. ఒకే పార్టీలో ఉండటం అసాధ్యం కానీ.. టీడీపీ అధినేత మాత్రం.. తన మార్క్ రాజకీయంతో అందర్నీ పార్టీలో ఉంచగలుగుతున్నారు. సాధారణంగా ఫ్యాక్షన్ నేపధ్యం ఉన్న వారు కలవడానికి అసలు ఆసక్తి చూపించరు. కానీ చంద్రబాబు.. ఫ్యాక్షన్కు కాలం చెల్లేలా.. వారందర్నీ.. ఒకే తాటిపైకి తీసుకు రాగలుగుతున్నారు. నిజానికి… రాజకీయ పార్టీల లక్షణం.. కలపడం కాదు.. విడగొట్టడం. ఇలా.. బలమైన నేతల మధ్య వీలయినంత దూరం పెంచి.. దాన్ని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. గతంలో వైఎస్ సీమలో ఇలానే చేశారని.. అందువల్లే అప్పట్లో బలమైన వర్గాలకు … నిలవడం వల్ల.. పట్టు సాధించారని చెబుతూ ఉంటారు. అయితే చంద్రబాబు మాత్రం.. దానికి భిన్నమైన పద్దతిని పాటిస్తున్నారు. గొడవల్లేకుండా.. అందర్నీ ఒకే పార్టీలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
టిక్కెట్ల సర్దుబాటులోనూ చంద్రబాబు రాజకీయ చాణక్యం..!
చంద్రబాబు.. ఒకే ఒరలో.. రెండు కత్తుల్ని.. పెట్టినప్పటికీ… ఎంత వరకు సర్దుకుపోతారనేది కీలకం. ఇద్దరు బలమైన నాయకులు.. అయనప్పుడు.. తమ ప్రభావం తాము చూపించాలనుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరో ఒకరికి ప్రాధాన్యం ఇచ్చి.. మరొకరి విషయంలో.. ఆలోచించాల్సి ఉంటుంది. ఎంత వరకూ.. ప్రాధాన్యం తగ్గించే నేతలకు సర్ది చెబుతారన్నదానిపై.. అసలు విషయం ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకూ.. అది సజావుగానే సాగింది. ఎన్నికల సమయంలో మాత్రం చిక్కులు తప్పవు. ఈ విషయంలో చంద్రబాబుకు ఓ అడ్వాంటేజ్ ఉంది. అదే జగన్ మార్క్ రాజకీయం. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా అందర్నీ కలుపుకుని వెళ్లే పరిస్థితి లేదు. అందుకే.. వారు జగన్మోహన్ రెడ్డిని నమ్మడానికి వారు సిద్ధపడటం లేదు. అందుకే.. ఆయన పార్టీలోకి వెళ్లడం లేదు.
నిజానికి రాజకీయం అంటే… విడదీసి పాలించడం. అందరి మద్య విబేధాలు పెట్టి.. ఒకరంటే.. ఒకరికి పడని పరిస్థితి తెస్తారు. కానీ చంద్రబాబు దానికి భిన్నం. అందర్నీ కలిపి.. రాజకీయాల్లో ఉన్న ఓ రకమైన శత్రుత్వానికి అంతం పలుకుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబుకు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు.