ఉందో లేదో అన్నట్లుగా ఉన్న టీడీపీని.. షర్మిల పార్టీకి హైప్ కల్పించడానికి కేసీఆర్ కొత్తగా టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. షర్మిల పార్టీ పెట్టడం వల్ల వివిధ కోణాల్లో టీఆర్ఎస్కే అనుకూలం అన్న చర్చ జరుగుతోంది. అందుకే.. ఆంధ్రోడు వచ్చి మామూలు పర్యటన చేస్తే సహించలేని టీఆర్ఎస్ నేతలు.. రాజకీయ పార్టీ పెడుతున్నా పెద్దగా వ్యతిరేకించడం లేదు. పైగా.. సభలు.. సమావేశాలు.. ఇతర రాజకీయ అంశాలపై సపోర్ట్ లభిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ విలీనం అనేదాన్ని కేసీఆర్ వ్యూహాత్మకంగా పూర్తి చేశారని… షర్మిల పార్టీ పెడుతున్న సమయంలో మరో ఆంధ్రా పార్టీ అనే ముద్ర వేయజానికి మరో పార్టీ లేకుండా చేయాల్న వ్యూహం అమలు చేశారన్ నచర్చ జరుగుతోంది.
షర్మిల తొమ్మిదో తేదీన అంటే… శుక్రవారమే ఖమ్మం జిల్లాలో పార్టీ ప్రకటన చేస్తున్నారు. దానికి రెండు రోజుల ముందుగానే… టీడీపీ విలీనం పూర్తి చేశారు. టీడీపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లా నుంచే ఉన్నారు. తెలంగాణ లో పూర్తిగా బలహీన పడిన టీడీపీ ఇంతో అంతో ఖమ్మంలోనే మెరుగ్గా ఉంది. ఇప్పుడక్కడ ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబి తీర్దం పుచ్చుకోవడంతో అది కాస్తా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో టీఆర్ఎస్ వైపు రాలేని టీడీపీ అభిమానులు.. ఇక షర్మిల పార్టీ వైపు వెళ్తారని దాని వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయన్న అంచనాలో ఉన్నారు. సాగర్లోనూ టీడీపీ అభిమానుల ఓట్లు తమకే పడతాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
షర్మిల పార్టీ మాత్రమే కాదు.. అటు ఇది వచ్చే ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా ఉపయోగ పడుతుందని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. మెచ్చా నాగేశ్వరరావు .. టీఆర్ఎస్లో చేరడానికి చాలా కాలంగా నిరాకరిస్తున్నారు. కానీ ఆయన నియోజకవర్గానికి ఒక్క పని కూడా ప్రభుత్వం చేయడం లేదు. చివరికి తెలంగాణలో టీడీపీ లేదు అనిపించేలా చేయడానికి సండ్ర సాయంతో ఒప్పించారు. చివరికి అనుకున్నది సాధించారు.