ఇటీవలి కాలంలో రాజకీయ హింస అంటే మొదటగా వినిపించే పేరు బెంగాల్. గతంలో బీహార్ దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కిడ్నాపులకు కేంద్రంగా ఉండేది. ఇప్పుడు ఆ రెండు అవలక్షణాలు ఏపీకి ఎక్కువగా పట్టేసుకుంటున్నాయి. ఫలితంగా ప్రజల జీవనం భయం భయంగా గడపాల్సి వస్తోంది.
ఏపీలో ప్రతీ రోజూ.. వైసీపీ నేతల హత్యలు, దాడులు, దహనాలు.. దౌర్జన్యాలు, కబ్జాల గురించి వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఫ్యాక్షన్ తరహా దారుణ హత్యలు చేస్తూండటం సంచలనం అయింది. ఊరిలో పలుకుబడి తెచ్చుకున్నారని ఏగిరెడ్డి కృష్ణ అనే టీచర్ ను అత్య్ంత కిరాతకంగా చంపడం… చర్చనీయాంశం అయింది. రాజకీయంగా ఎన్ని గొడవలు అయినా ఉండవచ్చు కానీ.. .. అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచన ఉత్తరాంధ్ర నేతల్లోకి రాదు. కానీ దాన్ని చొప్పించడంలో ఫ్యాక్షన్ పాలకులు సక్సెస్ అయ్యారు. ఫలితాలు కనిపించడం ప్రారంభిచాయి.
ఒక్క చోట కాదు ప్రతీ చోటా అదే అరాచకం. సుళ్లూరుపేటలో ఓ వైసీపీ నేత అయిన రౌడిషీటర్ ను కౌన్సెలింంగ్ కు పిలిస్తే ఎస్ఐపైనే దాడి చేశారు. కానీ ఆయనపై కేసు లేదు. ఇక సైకో పోలీస్ గ్ పేరు పడిన అంజూయాదవ్ .. ప్రతీ రోజూ.. అధికార పార్టీకి మద్దతుగా.. ప్రజల్ని పీడించుకు తింటున్నా కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఇక ఆస్తి ఓనర్ల పేర్లను సింపుల్ గా మార్చేసి.. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.
దాడులు, దౌర్జన్యాల పాలనతో ప్రజలు విసిగిపోతున్నారు చివరికి ఓటు కూడా ఉంటుందా ఉండదా అ్న స్థితికికి వెళ్లిపోతున్నారు. బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో ఇరవై మంది చనిపోయారు. ఏపీలో అంతకంటే దారుణంగా ఉంది. భయపెట్టి గెలవొచ్చని ప్రజాస్వామ్యంలో ఎవరైనా అనుకుంటే పరిస్తితులు ఇలాగే దిగజారిపోతాయి. ఈ నష్టం ఎవరికి జరుగుతుంది ?