దేశంలో కులగణన రాజకీయం జరుగుతోందని … తాము కూడా చేస్తామని బయలుదేరింది ఏపీ ప్రభుత్వం. అందులో ఇసుమంతైనా నిజాయితీ ఉందా అంటే… వైసీపీ సర్కార్ నుంచి అలాంటిది ఊహించలేమని మరోసారి నిరూపితమయింది. కేవలం రాజకీయ సమావేశాల్లాగా… ఈ వ్యవహరాన్ని నడిపించి డేటా సేకరించబోతున్నారు. కానీ దీనికి చట్టబద్ధత మాత్రం ఉండదు. కులగణనకు సంబంధించి మూడు పేజీల సర్క్యలర్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో వివిధ అంశాలను పేర్కొన్నప్పటికీ కీలకమైన చట్టబద్దత గురించి ఒక పదం కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కులగణన చేస్తామని మభ్య పెట్టడం తప్ప.. ఈ ప్రక్రియకు ఎలాంటి చట్టబద్ధత ఉండదని బీసీ వర్గాలకు సైతం క్లారిటీ వచ్చేసింది.
డిజిటిల్ విధానంలో, మొబైల్ యాప్ ద్వారా కులగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కులానికి మాత్రమే పరిమితం కాకుండా సామాజిక, విద్య, ఆర్థిక తదితర అంశాలపై కూడా వివరాలు సేకరించనున్నారు. ఇటీవల బీహార్లో జరిగిన కులగణన జరిగింది. ఒకటికి, రెండుసార్లు సంబంధిత వ్యక్తి చేత ధృవీకరించిన తరువాతే నమోదు చేయల్సి ఉంటుంది. దీనికి మాన్యువల్ విధానం సరైనది. బీహార్ లో అలాగే చేశారు. కానీ ఏపీలో యాప్ ద్వారా చేస్తున్నారు. గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ శాఖ సిబ్బంది చేత ఈ సర్వే నిర్వహిస్తున్నారు. వాలంటీర్లను కూడా దీనికోసం వినియోగించనున్నారు. ఇప్పటికే ఈ తరహాలో నిర్వహించిన కొన్ని సర్వేలు డేటా ప్రభుత్వం వద్ద ఉంది.
ఇదంతా రాజకీయ కార్యక్రమంలాగే జడరగనుంది. ముందుగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తారు. ఈ సదస్సుల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు, బిసి, ఇతర శాఖలకు చెరదిన 56 కార్పొరేషన్ల డైరెక్టర్లు స్థానిక ప్రజలకు రాజకీయ ప్రసంగాలు ఇస్తారు. ఈ సదస్సులను నిర్వహించడానికి యాంకర్లు లేదా మోడరేటర్లను ముందుగానే గుర్తించి ఎంపిక చేయడం చాలా ముఖ్యమని సర్క్యులర్లో పేర్కొనడం విశేషం. అందుకోసం వీరికి నగదు పారితోషకం చెల్లించాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కులగణనకు .. అసలు ఈ సదస్సులకు సంబంధం ఏమిటన్నది వైసీపీ వాళ్లకే తెలియాలి. పార్టీ ప్రచారం కోసం కులగణన కార్యక్రమాన్నీ వాడుకునేందుకు సిద్ధమయ్యారన్నమాట.