సికింద్రాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ మృతితో జరిగిన రాజకీయం అంతా ఇంతా కాదు. ఆయన ఎలా చనిపోయారో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అయితే దీన్ని ఒప్పుకునేందుకు చాలా మంది సిద్ధంగా లేరు. కళ్ల ముందు కనిపించే దృశ్యాలను కూడా వారు అంగీకరించడంలేదు. వితండవాదం చేస్తున్నారు. వారి ఇంటెన్షన్ ఏమిటో సులువుగానే అర్థమవుతుంది. పాస్టర్ ను చంపేశారని నమ్మించడానికి విచిత్రమైన వాదనలు తీసుకు వస్తున్నారు. దీని వల్ల ఎవరికి లాభం ?
క్రిస్టియన్ కమ్యూనిటిపై ఎవరికీ వ్యతిరేక భావం లేదు. ఉద్దేశపూర్వంగా ఎవరికీ వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. కానీ ప్రమాదవశాత్తూ జరిగిన ఓ మరణం అంశంలో ఇతరులే చంపేశారని టార్గెట్ చేస్తే వారిని వ్యతిరేకం చేసుకున్నట్లు కాదా ?. ఇలా మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటే ఎవరికి లాభం?. ప్రభుత్వాలను ఇలాంటి వాటితో ఇబ్బంది పెట్టడం వల్ల సహజంగానే మత రాజకీయాలకు ప్రాధాన్యం వస్తుంది. అప్పుడు జరిగే పరిణామాలకు అందరూ నష్టపోవాల్సి వస్తుంది.
దేశంలో ఇప్పటి వరకూ ఏం జరిగిందో అందరూ చూశారు. కనీసం ఎలాంటి ఉద్దేశాలు లేకుండా.. మత రాజకీయాలకు చాన్స్ లేకుండా పరిపాలిస్తున్న ప్రభుత్వాల విషయంలోనూ అయినా ఇలాంటి రాజకీయాలకు చెక్ పెట్టాలి. మత రాజకీయాలు చేయాలనుకుంటే.. హిందూ, క్రిస్టియన్ తేడాలు తీసుకు వచ్చి రాజకీయాలు చేస్తే రాష్ట్రం ఎంత ఘోరంగా మారుతుందో అంచనా వేస్తే ఇబ్బందికరమే. అందుకే మత సంస్థలకు చెందిన వారు.. ప్రవచన కర్తలు.. ఎవరూ రాజకీయ ట్రాప్లో పడకూడదనేది ఎక్కువ మంది చెప్పే మాట. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మత ఉద్యమకారులకు ఇది అర్థం అవుతుందా ?
వివేకానందరెడ్డికి అత్యంత ఘోరంగా నరికి చంపేసినా గుండెపోటు అని ప్రచారం చేశారు. కుదరకపోయే సరికి ఇతర రాజకీయం చేశారు. ఇప్పుడూ అలాగే చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాల ట్రాప్లో పడటం రాష్ట్రానికి ప్రమాదం.