ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు మాత్రమే అయింది. ఇప్పుడు పాలనపై దృష్టి పెట్టాల్సిన సమయం కానీ.. పూర్తిగా రాజకీయాలే నడుస్తున్నాయి. ఏపీ అధికార పార్టీ.. ప్రతిపక్ష పార్టీలపై గురి పెడుతూంటే… బీజేపీ .. వైసీపీపై గురి పెట్టిందని చెబుతున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో విలువలు లేవు. రాజకీయ భవిష్యత్ ఇచ్చారనే కృతజ్ఞత కూడా నేతలకు ఉండటం లేదు. తమ భవిష్యత్ కోసం.. ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. అందుకే.. ఎవరైనా తాము పార్టీ మారబోవడం లేదని చెబితే నమ్మే పరిస్థితి లేదు. అందుకే.. ఎవరెవరు ఎప్పుడు పార్టీ మారతారోననే చర్చ ఏపీ ప్రజల్లో ప్రారంభమయింది.
వలసలపై వైసీపీలో సలసలకు కారణం ఏమిటి..?
సుజనా చౌదరి అనాలోచితంగా అన్నారో.. ప్రీ ప్లాన్డ్ గా అన్నారో కానీ.. బీజేపీకి వచ్చేందుకు… వైసీపీ, టీడీపీ నేతలు రెడీగా ఉన్నారని… చెప్పడం.. కలకలం రేపుతోంది. తెలుగుదేశం పార్టీకి ఇలాంటివి అలవాటు అయిపోయాయి. ఎవరు పోయినా… పోతే పోనీ అనుకోవడం తప్ప మరో దారి లేదు. ఎందుకంటే.. టీడీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. కానీ.. వైసీపీ పరిస్థితి అదికాదు. అధికార పార్టీ. తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చిన పార్టీ. ఇరవై ఐదుకి ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచారు. 175కి 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇంత విజయం సాధించిన తర్వాత కూడా.. ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం… అదీ కూడా ఆరు నెలల్లోనే…అంటే ఏదో తేడా జరుగుతున్నట్లే లెక్క.
ఎంపీలను జగన్ ఎందుకు కట్టడి చేస్తున్నారు..?
మరో వైపు.. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని లైట్ తీసుకుంటే.. మొత్తానికే తేడా వస్తుందని.. వైసీపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. పార్టీని ధిక్కరిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్న రఘురామకృష్ణంరాజును.. అమరావతి పిలిపించి.. వివరణ అడిగejg. మరికొందరిపైనా.. జగన్ సీరియస్గా ఉన్నారని మీడియాకు లీక్ల ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అసలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి అనుమతి లేకుండా.. ఏ ఒక్క ఎంపీ.. బీజేపీ పెద్దల్ని కలవకూడదని ఆంక్షలు పెట్టడంతోనే.. అసలు అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఏదో పొగ లేకపోతే.. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత కంగారు పడతారన్నది అసలైన సందేహం.
జగన్ కట్టడి నిర్ణయాల వల్లే.. వైసీపీ భయపడుతుందన్న అభిప్రాయానికి వస్తున్నారా..?
జగన్మోహన్ రెడ్డి భయంతో పెడుతున్న ఆంక్షలో.. నిజంగానే.. పరిస్థితి తేడాగా ఉందో కానీ.. వైసీపీ నేతలు..ఏ అడుగేసినా.. అదిగో వారు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సీఎం రమేష్ .. కుమారుడి నిశ్చితార్థానికి.. పెద్ద సంఖ్యలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో.. అక్కడ ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతోందని … కూడా చెప్పుకోవడం ప్రారంభించారు. ఇదంతా.. జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆంక్షల వల్లే జరుగుతోంది. అసలు నిజం ఏమిటో… కొద్ది రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది.