వికారాబాద్ ఫారెస్ట్‌లో నేవీ రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇది దేశ రక్షణకు అత్యంత కీలకరమైన రక్షణ స్థావరం అవుతుంది. సముద్రంలో విధుల్లో ఉండే ఇండియన్ నేవీతో నిరంతరం టచ్‌లో ఉండేందుకు ఈ రాడార్ స్టేషన్ కీలకం. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి దీనిపై చర్చలు జరుగుతున్నాయి. చివరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అన్నీ సర్దుకున్నాయి. అడవిలో రాడార్ స్టేషన్ పెట్టడం కన్నా… అసలు దేశ రక్షణ వ్యవస్థను తెలంగాణలో పెట్టడం ఏందన్న అభ్యంతరం కొంత మందిలో ఎక్కువగా కనిపిస్తోంది.
బీజేపీని వ్యతిరేకించే ఓ వర్గం ఉద్యమకారులంతా హఠాత్తుగా పర్యావేరణ వేత్తలయ్యారు. ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అడవి మొత్తం నరికేస్తారని పర్యవరణం దెబ్బతింటుందని చెబుతున్నారు. నిజానికి అన్ని అంశాలపై కేంద్ర అటవీ శాఖ స్పష్టత ఇచ్చింది. అక్కడి స్థానికుల డిమాండ్లను తీరుస్తామని చెప్పింది. రిజర్వ్ ఫారెస్టు లో చిన్న చెట్లు కూడా తొలగించబోమని… రాడార్ స్టేషన్ కు దాదాపుగా మూడు వేల ఎకరాలు కేటాయించారు కానీ దాన్ని మొత్తం చదును చేయబోమని చెబుతున్నారు. కొన్ని చెట్లు తొలగించినా అంతకు పది రెట్లు పెంచేందుకు నిధులు కూడా విడుదల చేశారు.
కోర్టుల్లోనూ పిటిషన్లు వేశారు. అన్ని క్లియర్ అయిపోయాయి. కానీ ఈ ఉద్యమకారులు బీజేపీ నేతలు ఆరోపించే అర్బన్ నక్సల్స్ తరహాలో వ్యవహరిస్తున్నారు. అడవిలో గిరిజనుల పేరుతో పోడు వ్యవసాయం పేరుతో ఇష్టం వచ్చినట్లుగా అడవిని నరికేసుకుంటూ పోతే వీరు సమర్థిస్తారు. కానీ ప్రత్యామ్నాయ అడవిని అభివృద్ధి చేస్తూ దేశ రక్షణకు అవసరమైన రాడార్ కేంద్రాన్ని పెడతామటే మాత్రం.. పర్యావరణం పేరుతో ఫేక్ ఉద్యమాలు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా దేశానికి వ్యతిరేకమేనని ఎక్కువ మందిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.