రాజకీయం కోసం హిందువుల మనోభావాలను.. కోట్లాది మంది గుండెల్లో కొలువైన… ఆ దేవదేవుడ్ని.. వివాదాస్పదం చేయడానికి జరిగిన ప్రయత్నాలు మన కళ్ల ముందే లేవా..? దక్షిణాదిలో అడుగు పెట్టడానికి… ఇక్కడ శక్తుల అండతో… ఆ శ్రీనివాసుడ్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు జుగుప్సాకరంగా లేవా..? ఇక్కడ విఫలమవడంతో వారు.. శబరిమలలో.. తమ రాజకీయం చేసి… ఎంత రచ్చ చేశారో… చూస్తూనే ఉన్నాం కదా..!. జగన్- బీజేపీ జోడి.. మత రాజకీయాలతో ఏం చేయబోయిందో చూసి కూడా.. కోన వెంకట్ జంధ్య కట్టిన ప్రతి బ్రాహ్మణుడు.. జగన్‌కే ఓటు వేయాలని ఎలా అంటారు..?
తిరుమలను మరో అయోధ్య చేసే కుట్ర ఎవరిది..?
తిరుమలగిరులకు.. భక్తులకు అత్యంత పవిత్రం. తిరుమలకు వెళ్తే.. ఒక్క గోవిందనామస్మరణ తప్ప.. మరో విషయం ఆలోచించడానికి భక్తులు ఇష్టపడరు. ఒక్క క్షణం దర్శన భాగ్యం కోసం.. రోజంతా నిలబడి ఉండే భక్తులు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు. పిసరంత ప్రసాదాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్లకు అద్దుకుని మహాప్రసాదం అనుకుని ఆనందపడిపోతారు. కోట్లాది మంది భక్తుల్లో ఆ దేవునికి ఉన్న పవిత్ర అది. కానీ ఆ పవిత్రతను రాజకీయం కోసం… రోడ్డుకీడ్చే ప్రయత్నం చేసింది ఎవరు..?. ఓ పక్కా ప్రణాళిక ప్రకారం.. కొండపైన తవ్వకాలంటూ… రచ్చ చేసి.. అనేక రకాల అనుమానాలను ప్రజల్లోకి చొప్పింది.. శ్రీవారి ఆలయ ప్రతిష్ట మంటగలిపి.. భక్తుల్లో ఆందోళన రేపి.. రాజకీయంగా లబ్ది పొందాలనే ప్రయత్నం చేసింది ఎవరు..? మనోభావాలను దెబ్బతీయాలన్న సంకల్పంతో.. తిరుమలలో ఎంతో పవిత్రంగా సాగే పూజాధికాలను కూడా.. వివాదాస్పదం చేసేందుకు.. ఎందుకు వెనుకాడలేదు. శ్రీవారి భక్తులు ఎక్కడ ఎక్కువ ఉంటారో.. అక్కడకు వెళ్లి మరీ .. ఓ ప్రధాన అర్చకుడితో.. ఆరోపణలు చేయించడం ఎందుకు..? అమిత్ షా నేతృత్వంలో.. జగన్ డైరక్షన్లో సాగిన ఈ వ్యవహారానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ బయటకు వచ్చినా.. ఎందుకు కిక్కురుమనడం లేదు.
Click here for Part 1 : మనుశర్మ : నేను జంధ్యం కడతా..కోన..! కానీ జగన్‌కే ఎందుకు ఓటేయాలి..?
వైఎస్ హయాంలో తిరుమలలో ఏం జరిగింది..? ఇప్పుడేం జరిగింది..?
తిరుమల పవిత్రతకు.. అత్యంత దుర్భమైన రోజులు.. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు. ఆ విషయం శ్రీవారి భక్తులకు అందరికీ తెలుసు. సహజంగా కొండపై.. శ్రీవారి నామమే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.కానీ.. ఆయన హయంలో.. అనుచరులందరికీ.. హోటళ్లు సహా.. వ్యాపారాలన్నీ కట్టబెట్టడంతో.. శ్రీవారికి పోటీగా.. వైఎస్ ఫోటోలు దర్శనమిచ్చేవి. సాక్షాత్తూ టీటీడీ పరిపాలనా కేంద్రం అన్నమయ్య భవన్ కింద భాగంలో ఉండే.. హోటల్లో.. శ్రీవారి ఫోటో కన్నా… రాజశేఖర్ రెడ్డి ఫోటోనే అప్పట్లో పెద్దదిగా ఉండేది. అది చూసి భక్తులు బుగ్గలు నొక్కుకోవడం తప్ప.. మరేమీ చేయలేకపోయేవారు. ఇక ఏడుకొండలను రెండు కొండలే అన్న సంగతి సరే సరి. అదే సమయంలో.. ప్రైవేటు హోమాలు.. ప్రైవేటు ఆశీర్వాదాలు… ఇలా.. ప్రతీది నిబంధనలకు విరుద్ధంగానే సాగింది. హిందూవాదులు మనసులో బాధపడటం తప్ప.. ఏమీ చేయలేని దుర్భర పరిస్థితి అది. ఇప్పుడు… తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని.. చెప్పడానికి ఒక్కటంటే.. ఒక్కటీ లేదు. రాజకీయం కోసం… శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించిన వారికి బలవంతంగా.. రిటైర్మెంట్ ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల తమకు అవకాశాలొస్తాయని సంతోషపడిన మిరాశీ కుటుంబాలే ఎక్కువ.
తిరుమలలో పారలేదనే శబరిమల మీద పడ్డారు..!
దక్షిణాదిలో ముఖ్యంగా… ఏపీ, కర్ణాటక, తమిళనాడుల్లో… అడుగు పెట్టడానికి భారతీయ జనతా పార్టీ నేతలకు.. తిరుమల శ్రీనివాసుడే కనిపించాడు. ఆయనపై కుట్ర చేసి.. ఏపీలో జగన్‌తో కలిసి చేయాల్సింది చేస్తే.. మరో అయోధ్యలా మార్చి… పబ్బం గడుపుకుందామనుకున్నారు. కానీ.. సాధ్యం కాలేదు. అందుకే.. శబరిమల మీదకు వెళ్లారు. హిందూత్వం అంటే.. నమ్మకం. ఆ నమ్మకం ఉన్న వారే శబరిమలకు వెళ్తారు. కానీ కోర్టులకు తీసుకెళ్లి.. విభిన్న వాదనలు వినిపించి.. తీర్పులు తెప్పించి… ముందు ఆహ్వానించి.. ఆ తర్వాత మంట పెట్టి… శబరిమల పవిత్రను దెబ్బతీశారు. కానీ కాపాడేది మేమే అంటూ… హిందూత్వ భావాలను ప్రజల్లో రెచ్చగొట్టి ఓట్ల వేటకు సిద్ధమయ్యారు. ఇది కళ్లముందు కనిపించే నిజం. నిజంగా హిందూ వాదులైతే.. అయ్యప్పను అలా వివాదాస్పదం చేస్తారా..?. తిరుమల వెంకన్నను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తారా..?
Click here for Part 2 : మనుశర్మ : తిరుమల రెండు కొండలే అన్న వారి వారసులకు పట్టమెలా కడతాము..?
కోన వెంకట్.. జంధ్యం కట్టు ప్రతి బ్రాహ్మణుడు.. జగన్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. కానీ.. జంధ్యం కట్టుకున్న ప్రతి బ్రాహ్మణుడు.. దేవదేవుల పట్ల అత్యంత భక్తి ప్రపత్తులతో ఉంటారు. వారితో రాజకీయం చేయాలనుకోరు. దేవుడిని దేవుడిగానే చూడాలి. దేవుడిని రోడ్డుపైకి తెచ్చి రాజకీయం చేయకూడదు. జంధ్యం కట్టే ఏ బ్రాహ్మణుడు.. ఇలాంటి ప్రయత్నాలను క్షమించరు. అన్యమతస్తులను నెత్తికెక్కించుకోరు..!