చంద్రగిరి నియోజకవర్గంలో.. ఉరుములేని పిడుగుల్లాగా… వైసీపీ అభ్యర్థి ఇచ్చిన ఫిర్యాదుతో… ఒక్క సారిగా ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ పెట్టడం… దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. ఏ ఉద్దేశంతో రీపోలింగ్‌కు లాబీయింగ్ చేసుకున్నారో.. చెవిరెడ్డి దాన్ని అమలు చేయడం ప్రారంభించారు. తెల్లవారే సరికి ఉద్రిక్త పరిస్థితుల్లో కల్పించి.. ఆయా గ్రామాల్లో మనుషులు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు.
ఐదు గ్రామాల్లో వేయి మంది పోలీసులు..!
చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో రీపోలింగ్‌కు… ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కచ్చితంగా.. మూడు రోజుల సమయం ఇచ్చి.. రీపోలింగ్ ప్రకటించడంతో.. అధికారులు నానా హైరానా పడుతున్నారు. ఈ లోపు.. వైసీపీ అభ్యర్థి ఆయా గ్రామాల్లో డబ్బులను పంపిణీ చేశారు. ఆ తర్వాత… గ్రామాల్లో అలజడి రేపడం ప్రారంభించారు. గురువారం సాయంత్రం… ఓ గ్రామానికి తన కుమారుడ్ని పంపారు. అక్కడ అతన్ని అడ్డుకుంటారని తెలిసి… ఆ సమాచారం రాగానే ఉద్రిక్తత సృష్టించేందుకు ముందుగానే రెడీ అయ్యారు. అనుకున్నట్లుగానే ఆ గ్రామంలో ఉద్రిక్తత సృష్టించారు. ఫలితంగా… ఎడెనిమిది వందల మంది ఉండే గ్రామంలో.. నాలుగు వందల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
ఓటర్లను భయపెట్టి ఓటింగ్‌కు దూరం చేసే వ్యూహమా..?
మిగతా నాలుగు గ్రామాల్లోనూ… చెవిరెడ్డి అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దాంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కొత్త వ్యక్తుల్ని ఆ గ్రామాల్లోకి రానివ్వడం లేదు. దాంతో.. గ్రామాల్లో భయాందోళన నెలకొంది. రీపోలింగ్ లోపు.. ఇంకెన్ని ఘటనలు చూడాల్సి వస్తుందోనని.. వారు ఆందోళన చెందుతున్నారు. తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అనుకూల గ్రామాలైన వీటిలో.. గత ఎన్నికల్లో మొత్తం… నాలుగు వేల ఓట్లలో.. వైసీపీకి.. 250 ఓట్లు కూడా రాలేదు. ఈ సారి కూడా అయా గ్రామాల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదైంది. రీపోలింగ్ పెట్టించి.. కనీసం ఓ వెయ్యి ఓట్ల పోలింగ్‌ను తగ్గించినా… తనకు ప్లస్ అవుతుందని… చెవిరెడ్డి స్కెచ్ వేశారు. దానికి తగ్గట్లుగానే… రీపోలింగ్ కు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. అందుకే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా నెల తర్వాత రీపోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ.
టీడీపీకి పట్టున్న గ్రామాలు కావడం వల్లే ఈ పరిస్థితి..!
రీపోలింగ్ జరగాల్సిన ఐదు గ్రామాల్లో.. చాలా మంది.. ఉపాధి కోసం… హైదరాబాద్, బెంగళూరు, పుణెల్లో ఉంటారు. వారందరూ.. మళ్లీ పోలింగ్ కోసం రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెవిరెడ్డి కుట్రపూరితంగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని.. ఆయా గ్రామాల ప్రజలు.. గట్టిగానే భావిస్తున్నారు. అందర్నీ మళ్లీ పిలిపిస్తున్నారు. కానీ చెవిరెడ్డి ప్రొద్భులంతో.. ఈ రెండు రోజుల్లో.. ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మాత్రం.. ఆయా గ్రామాల్లో ఉంది.