అమరావతికి రుణం ఎందుకు ఇవ్వడం లేదో ప్రపంచబ్యాంక్ క్లారిటీ ఇచ్చింది. కానీ ఏపీలో రాజకీయం మాత్రం.. కారణాలేమిటో మాత్రం… ఎవరికి వారు క్లారిటీ తెచ్చేసుకుని ఒకరికనొకరు విమర్శలు గుప్పించుకున్నారు. చంద్రబాబు అవకతవకలకు పాల్పడటం వల్లే ప్రపంచబ్యాంక్ రుణం ఇవ్వలేదని.. వైసీపీ వాదిస్తే… జగన్ ను .. ప్రపంచబ్యాంక్ నమ్మలేదని.. అందుకే.. రుణం ఇవ్వలేదని.. టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఈ క్రమంలో.. కేంద్రం అసలు ఇవ్వొద్దని చెప్పడం వల్లే.. తాము ఆపేశామని.. ప్రపంచబ్యాంక్ ప్రకటించింది. అయితే.. ఈ ప్రకటనలో.. కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు సాయం కొనసాగిస్తామని.. బిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం అందిస్తామని ప్రపంచబ్యాంక్ తెలిపింది. దీనిపైనే ఇప్పుడు అసలు రాజకీయం ప్రారంభమయింది.
నగదు బదిలీ పథకాలకు ప్రపంచబ్యాంక్ సాయం చేస్తుందా..?
ఆంధ్రప్రదేశ్‌కు బిలియన్ డాలర్ల సాయం చేస్తామని.. ప్రపంచబ్యాంక్ చెప్పగానే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఆ పార్టీకి చెందిన అనుబంధ మీడియా… వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలను మెచ్చి.. ప్రపంచబ్యాంక్ సాయం చేయబోతోందన్న ప్రచారం ప్రారంభించారు. ఇక.. జగన్ పథకాలకు.. ఆర్థిక కష్టాలే ఉండవని.. అన్నింటికీ ప్రపంచబ్యాంక్ సాయం చేస్తుందని… అదే జగన్మోహన్ రెడ్డికి ఉన్న పలుకుబడి అని చెప్పడం ప్రారంభించారు. కానీ ప్రపంచబ్యాంక్ అసలు చెప్పింది.. ఏపీ ప్రభుత్వ ప్రగతి శీల కార్యక్రమాలకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మాత్రమే. అభివృద్ధిలో తమ వంతు భాగస్వాములు అవుతామని చెప్పడం మాత్రమే. ముందు ముందు జగన్ సర్కార్ అభివృద్ధి ప్రాధాన్యతలను నిర్ణయించుకుని తమ వద్దకు వస్తే.. పరిశీలించి సాయం చేస్తామని చెప్పడం మాత్రమే.
గత ప్రభుత్వాల ట్రాక్ రికార్డు వల్లే ఏపీపై వరల్డ్ బ్యాంక్ ఔదార్యం..!
ప్రపంచబ్యాంక్ రుణంతో.. ఏపీలో ప్రాజెక్టులు చేపట్టడం.. ఒక్క అమరావతితోనే ప్రారంభం కాలేదు. దశాబ్దాలుగా.. ప్రపంచబ్యాంక్.. ఆంధ్రప్రదేశ్‌కు రుణం ఇస్తోంది. పాతికేళ్ల కిందటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఆయన ప్రపంచబ్యాంక్ రుణాలతో చేపట్టిన ప్రాజెక్టులు ఓ రేంజ్లో ఉండేవి. అందుకే.. చంద్రబాబును కమ్యూనిస్టులు.. ప్రపంచబ్యాంక్ ఎజెంటని కూడా విమర్శిస్తూ ఉండేవారు. అయితే.. ప్రపంచబ్యాంక్ రుణం అంత తేలిగ్గా ఇవ్వదు. ప్రయారిటీస్ అన్నీ చూసుకుని… ఉత్పాదక పథకాలు.. అయితే మాత్రమే.. సాయం చేస్తుంది. నిబంధనలు పెడుతుంది. అన్నింటినీ అమలు చేయాలి. సామాజిక అభివృద్ధి పథకాలు.. మహిళల స్వావలంబన.. అంటే సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాలు ఇలాంటి వాటికి మాత్రమే సాయం చేస్తుంది. ఇలాంటివి గత ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేసిన విషయాన్ని మాత్రమే ప్రపంచబ్యాంక్ తన వివరణలో ప్రస్తావించింది.
వాటినీ తమ క్రెడిట్‌గా చెప్పేసుకుంటున్న వైసీపీ..!
ప్రపంచబ్యాంక్ ఎప్పుడూ ఉచిత పథకాలు, నగదు బదిలీ పథకాలకు.. రుణాలు ఇవ్వదు. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగినా… అతి మా ఘనత… వ్యతిరేక పక్షం.. చేతకాని తనం అని ప్రచారం చేయడానికి అధికార, ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో.. సొంత మీడియా ఉండటంతో.. వైసీపీ హడావుడి ఎక్కువగా ఉంటోంది. అమరావతిలో అవకతవకలు జరిగాయని.. అందుకే రుణం అగిపోయిందని ప్రచారం చేసిన.. సాక్షి మీడియా ఇప్పుడు.. ప్రపంచబ్యాంక్‌కు.. జగన్ పాలనపై ఎంతో నమ్మకం ఉందని.. అందుకే.. బిలియన్ డాలర్లు ఇస్తోందని చెప్పుకుంటున్నారు.
Click here for : World Bank statement on Amaravati and its ongoing partnership with Andhra Pradesh