సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ మంచి స్నేహితులు. 1982లో కృష్ణ కథానాయకుడిగా విడుదలైన రాజకీయ చిత్రం “ఈనాడు” సినిమా అప్పుడే రంగప్రవేశం చేసిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు, ప్రచారానికి చాలా ఉపయోగపడింది. ఎన్నికలు మూడువారాల్లో ఉన్న స్థితిలో విడుదలైన ఈ సినిమా తెలుగుదేశం ప్రచారానికి ఉపయోగపడిందని చెబుతారు.1983లో ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెళ్ళ భాస్కరరావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కరరావును కృష్ణ అభినందిస్తున్నట్టు ఫుల్‌పేజీ ప్రకటన విడుదల అయింది.
ఈ సంఘటనతో కృష్ణకి, రామారావుకి మధ్య విభేదాలువచ్చాయి. ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యాకా ఈ విభేదాలు రాజుకున్నాయి. ప్రధాని రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు 1984లో కృష్ణ కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత కృష్ణ తెలుగు దేశం ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ సినిమాలు చేశారు. దానికి `మండలాదీశుడు` పరాకాష్ట. టిడిపి ప్రభుత్వాన్నిదెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ నుంచి కృష్ణ నటించిన సినిమాల ద్వారా ప్రయత్నించారని చెబుతారు. 1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం కోరుకున్నా తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీచేయించింది. ఆ ఎన్నికల్బోళ్ళ బుల్లిరామయ్ చేతిలో కృష్ణ ఓటమి పాలయ్యారు. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2009 ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ కు కృష్ణ పరోక్ష మదత్తు ఇచ్చారు.