ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాత బీజేపీ మౌనం పాటిస్తోంది. గెలుపోటములు రాజకీయాల్లో సహజం.. అంటూ మోదీ ట్విటర్లో ఓ కామెంట్ చేసి ఊరుకున్నారు. గతంలో ఏదైనా చిన్న రాష్ట్రంలో విజయం సాధించినా.. దాన్ని మోడీ మెడలో వీరతాడుగా వేసేవారు. దాదాపు 16 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. గెలిచిన ప్రతీసారి మోదీ-షా.. 2 ప్రధాన కార్యాలయంలో ‘విజయ యాత్ర’ నిర్వహించేవారు. కానీ ఐదు రాష్ట్రాల్లో ఓడిపోయాక వీరు పార్టీ ఆఫీసుకే వెళ్లలేదు. అందుకే విజయాల్ని మత ఖాతాలో వేసుకున్నట్లుగా.. ఓటముల్ని ఎందుకు వేసుకోరనే ప్రశ్న బీజేపీలో ప్రారంభమయింది.
ఇప్పటికే మోడీ, షా వర్గీయులు.. దీనిపై చిత్ర,విచిత్రమైన వాదనను.. తెరపైకి తీసుకు వస్తున్నారు. రాష్ట్రాల్లో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత వల్ల…ఓడిపోయారని… చెప్పుకొస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలనేవి స్థానిక అంశాల ప్రాతిపదికగా జరుగుతాయి అని… మోదీ, షాలను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ సర్కార్ల వైఫల్యం వల్లేనని నేరుగా వాదిస్తున్నారు. అలా అయితే.. ఇతర రాష్ట్రాల్లో విజయాలను ఎలా తమ ఖాతాలో వేసుకున్నారనేది.. చాలా మందికి అర్థం కాని విషయం. నిజానికి మోడీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా… ఆయనను చాలా తక్కువగా ప్రచారానికి వాడుకున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు వ్యవససాయ అధారిత రాష్ట్రాలు, రైతులు కష్టాల్లో ఉన్నారు. కేంద్ర విధానాలు సరిగ్గా లేవు. తాము ఓడిపోతే దానికి కారణం తమ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత కాదని … కేంద్రం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లేనని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ఆరెస్సెస్ నేతల వద్ద తన గోడు వెళ్ల బోసుకున్నారని చెబుతున్నారు.
అయితే… మోడీ, షాలు పార్టీలో తమకు వ్యతిరేకంగా గళం పెరగకుండా ఉండేందుకు విరుగుడు చర్యలు ప్రారంభించారు. రాష్ట్రాల్లో అధికారాలు కోల్పోయనప్పటికీ… ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కీలక పదవుల్ని ఆశ చూపుతున్నారు. రమణ్ సింగ్, చౌహాన్‌లకు కేంద్రమంత్రి పదవులు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరాజేకు.. అమిత్ షా, మోడీలకు మొదటి నుంచి సత్సంబంధాలు లేవు. కాబట్టి.. ఆమెను… రాజస్థాన్ కే పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.