తెలంగాణ ఎన్నికల ఫలితం… ప్రజలు వినియోగించుకునే ఓట్ల శాతం పై ఆధారపడి ఉంటుందని లగడపాటి రాజగోపాల్ చెబుతున్నారు. గత ఎన్నికల్లో 68.5 శాతం పోలింగ్ నమోదయింది. ఈ పర్సంటేజీ కన్నా పోలింగ్ పెరిగితే.. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే.. ప్రత్యామ్నాయం కోసం.. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారన్నది రాజకీయవర్గాల విశ్లేషణ. దానికి తగ్గట్లుగానే.. లగడపాటి… పోలింగ్ శాతం పెరిగితే.. అధికార పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రకిటంచారు.
గత ఎన్నికల్లోలా 68.5 శాతం ఓటింగ్ జరిగితే.. ప్రజాకూటమికే.. స్వల్ప అధిక్యత ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. నాలుగు జిల్లాల్లో కూటమి, మూడు జిల్లాల్లో టీఆర్ఎస్, రెండు జిల్లాల్లో హోరాహోరీగా ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో పోలింగ్ శాతం తగ్గితే మాత్రం హంగ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే… ఏ విధంగా చూసినా…పోలింగ్ పర్సంటేజీ.. గత ఎన్నికల్లాగనే ఉన్నా.. కొంచెం పెరిగినా.. ప్రజాకూటమికే.. అనుకూలం అని లగడపాటి తన అధ్యయనంలోతేలిందంటున్నారు. ఎంత ఎక్కువ ఓటింగ్ శాతం పెరిగితే.. ప్రజాకూటమికి అంత ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉందంటున్నారు.
అదే పోలింగ్ శాతం తగ్గితే.. అధికార పార్టీకి అనుకూలం కాదు. కానీ… హంగ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ, ఎంఐఎం గణనీయమైన సీట్లు తెచ్చుకునే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఓ రకంగా.. టీఆర్ఎస్ కి రెండు దారులు మూసుకుపోయినట్లేనని చెప్పుకోవచ్చు. పోలింగ్ శాతం బాగా తక్కువ నమోదయి.. హంగ్ వస్తే.. మాత్రం.. బీజేపీతోనో.. ఎంఐఎంతోనే కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఏ విధంగా చూసినా.. ఈ సారి పోలింగ్ పర్సంటేజీనే.. అసలు ఫలితాలను నిర్దేశించబోతున్నది. ప్రజాకూటమి ఎంత ఎక్కువ మందిని.. ఓటింగ్ కేంద్రాల వైపు ఆకర్షించగలుగుతుందో… అంతగా అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయి.