అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. రేపే కౌంటింగ్ జరుగుతుంది. రెండురోజుల పాటు కౌంటింగ్ హడావుడి ఉంటుంది. ఎందుకంటే ఎవరికీ పూర్తి మెజార్టీ అంత తేలికగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పోల్ ప్రిడిక్టర్స్ అందరూ జనం పల్స్ పట్టుకోవడం తమ వల్ల కాదు అని.. ఎవరికి నచ్చినవారు.. తమకు నచ్చిన నేత గెలుస్తారని చెబుతున్నారు. ఎలాన్ మస్క్ దగ్గర నుంచి అందరిదీ ఇదే పని .
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడూ లేనంత హోరాహోరీగా సాగుతున్నాయన్నది నిజం. బైడెన్ వర్సెస్ ట్రంప్ అన్నట్లుగా ఉంటే ఈ పాటికి ట్రంప్ ఆధిపత్యం కనిపించేది. కానీ బైడెన్ వ్యూహాత్మకంగా తప్పుకుని కమలా హ్యారిస్ కు దారి ఇవ్వడంతో సీన్ మారిపోయింది. పోరు హోరాహోరీగా సాగుతోంది. ట్రంప్‌కు అంత ఈజీ కాదని చెప్పుకుంటున్నారు. మరి కమలా హ్యారిస్‌కు సులువా అంటే ఆ పరిస్థితి కూడా లేదంటున్నారు. ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి.
పాపులర్ ఓట్లు కమలాహ్యారిస్ కే ఎక్కువ వస్తాయని ఎక్కువ మంది అంచనా. కానీ ఎలక్టోరల్ ఓట్లు ఎన్ని వస్తాయన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. స్వింగ్ స్టేట్స్ చాలా కీలకం. గత ఎన్నికల్లో ఓ పార్టీ గెలిచి ఈ సారి మరో పార్టీకి మెజార్టీ వచ్చే రాష్ట్రాలే ఫలితాలను నిర్దేశించబోతున్నాయి. మొత్తం ఆరేడు రాష్ట్రాలు అధ్యక్షుడ్ని.. లేదా అధ్యక్షురాల్ని నిర్ణయించబోతున్నాయి. కౌంటింగ్ చివరి వరకూ ఎవరూ విజేతో నిర్ణయించడం అంత తేలిక కాదు.
అమెరికాకు ఇంత వరకూ మహిళా అధ్యక్షురాలు లేరు. కమలా హ్యారిస్ గెలిస్తే ప్రపంచంలోనే పవర్ ఫుల్ ప్రజాస్వామ్య దేశానికి పవర్ ఫుల్ మహిళా అధ్యక్షురాలు వచ్చినట్లవుతుంది.