తెలంగాణలో మూడు నెలల కిందటే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దేశం దృష్టి ఆ ఎన్నికలపై పడింది. ఇప్పుడు తొలి విడతలోనే… తెలంగాణ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కానీ… ఎవరూ పట్టించుకోవడం లేదు. బయట వాళ్లు కాదు.. అసలు తెలంగాణలోనే ఎన్నికల వాతావరణం కరవయింది. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు.. ఇంత కాలం తాము పడిన కష్టాన్ని తల్చుకుంటూ.. ఉండిపోతున్నారు. మరోసారి ఎంపీ అభ్యర్థుల కోసం ఆ స్థాయిలో కష్టపడటం వారి వల్ల కావడం లేదు. అందుకే.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓడిపోయిన వారు అసలు లెక్కలోనే లేరు. దీంతోపాటు.. గెలిచిన టీఆర్ఎస్ నేతలు… ఇక ప్రత్యామ్నాయం లేదు కదా.. అని రిలాక్స్ అయిపోతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చి పడిన ఓటమితో.. దిగాలుపడిపోయిన కాంగ్రెస్… ప్రజలు ఓట్లేస్తే సరి.. లేకపోతే లేదన్నట్లుగా ఉంటోంది. ఫలితంగా.. పోటీ పోటీ ప్రచారాలు ఎక్కడా కనిపించడం లేదు. గ్రామాల్లో అయితే.. కొత్తగా మళ్లీ ఓట్లు వేయాలన్న సమాచారం కూడా.. చాలా మందికి తెలియని పరిస్థితి ఏర్పడింది. పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రం.. ఎంపీ అభ్యర్థులు ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు.. ఎంపీ ఎన్నికలు కలసి వస్తే… గ్రామా గ్రామన సందడి నెలకొనేది. అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది. కానీ వాటిని ముందే ముగించేయడంతో.. తెలంగాణ లోక్సభ ఎన్నికలు కళ తప్పాయన్న అభిప్రాయం ఏర్పడేలా ఉంది.
అధికార పార్టీగా టీఆర్ఎస్ నేతలు మాత్రమే సభలు, సమావేశాలతో హడావుడి చేశారు. కాంగ్రెస్ నేతలు.. రాహుల్ ను పిలిపించి.. రెండు సార్లు ఓ మాదిరి సభలు ఏర్పాటు చేశారు కానీ… ఇక ఉమ్మడిగా ఒకరి ప్రచారాన్ని మరొకరు చూసుకునే పరిస్థితి లేదు. ఏడెనిమిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలంగానే ఉన్నారు. వారి కోసం.. ఇతరులు ప్రచారం చేసే పరిస్థితి లేదు కానీ.. వారు మాత్రం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. విభిన్న వర్గాల మద్దకు కోసం ప్రయత్నాలు చేశారు. అంతకు మించి.. ఇక తెలంగాణలో.. అంత పెద్ద ప్రచార హడావుడి.. ఎన్నికల వాతావరణం పెద్దగా లేదు. అందుకే పోలింగ్ శాతం.. ఈ సారి బాగా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.