తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్, వాటి అనుబంధ కంపెనీలు ఏపీలో కొన్ని వేల కాంట్రాక్టులు పొందాయి. విద్యుత్ పనుల దగ్గర నుంచి గనుల సీవరేజీ వసూలు వరకూ ఎందులో అవకాశం ఉంటే అందులో కాంట్రాక్టులు పొందాయి. డూప్లికేట్ బ్యాంక్ గ్యారంటీలను సమర్పించాయి. ఇప్పుడు ప నులు చేయడం ఆపేశాయి. సర్దుకుని వెళ్లిపోయాయని .. ఒప్పుకున్న ధరలకు పనులు చేయడం కష్టమని వారు చెబుతున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి.
కొట్టుకుపోయిన రాజంపేట అన్నమయ్య డ్యాం కట్టేందుకు కూడా రాఘవ కన్ స్ట్రక్షన్స్ నే కాంట్రాక్ట్ తీసుకుంది. కానీ ప్రారంభించలేదు. విద్యుత్ కాంట్రాక్టులు.. ఇతర పనులు చాలా తీసుకుంది. కానీ పనులు మాత్రం చేయలేదు. ఇప్పుడు పనులు చేసే ఆసక్తి లేనట్లుగా అసలు కదలికల్లేవు. ఆ కాంట్రాక్టులకు ఇచ్చిన విదేశీ బ్యాంకు గ్యారంటీలు ల్యాప్స్ అయిపోయాయి. వేరే గ్యారంటీలు ఇవ్వాలని అధికారులు అడుగుతూంటే స్పందించడం లేదని చెబుతున్నారు.
జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన పొంగులేటి… తెలంగాణలో కేసీఆర్ తో దూరం పెరిగిన తర్వాత వ్యాపారాల్ని ఎక్కువగా ఏపీలో చూసుకున్నారు. చాలా కాంట్రాక్టులు పొందారు. ఇప్పుడు అక్కడ టీడీపీ గెలిచే సరికి.. ఇక వర్కవుట్ అవడం కష్టమేనని సర్దుకుని వెళ్లిపోయారు. అయితే ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది ఆసక్తికరం.