కోర్టులో కౌంటర్ వేయడానికి అవసరమైన వివరాలు ఉండవు కానీ తప్పుడు ప్రచారాలు మీడియా ముందు చేయడానికి మాత్రం రోజుకో ప్రదేశం తిరగాలని సీఐడీ కేసులో జంట కవులుగా మారిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్ నిర్ణయించుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అసలు దర్యాప్తు పనులు చేయకుండా ఈ మీడియా సమావేశాలేమిటో …. ప్రజలకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారో కానీ.. మొత్తం ఓ ప్రణాళిక ప్రకారం తప్పుడు ప్రచారం చేయడానికి మాత్రమే అన్నట్లుగా కథ సాగుతోంది.
పొన్నవోలు సాధాకర్ రెడ్డి… రిమాండ్ రిపోర్టును సాక్షి మీడియాలో రోజుకు రెండు, మూడు సార్లు చదువుతారు. అదే ఆయన చేసే పని. దానికి అదనంగా పొలిటికల్ కామెంట్స్… సీఐడీ సంజయ్ గురించి చెప్పాల్సిన పని లేదు.. ముందుగా అసలు మొత్తం కుట్ర రచయిత సజ్జల ప్రెస్ మీట్ పెడతారు…. తర్వాత సంజయ్ తెరపైకి వస్తారు. ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు లేని ఆధారాలు చేస్తారు. మీడియా ప్రశ్నలకు ఆయన దగ్గర సరుకు ఉండదు. కానీ తప్పుడు ప్రచారం చేయడానికి రెడీ అయిపోతారు. తాను చేసిన ఆరోపణల్లో తప్పు ఏమి ఉంది.. ఎలా ఉంది.. దానికి చంద్రబాబు ఎలా బాధ్యుడో మాత్రం చెప్పరు.
మార్గదర్శి కేసు విషయంలోనూ అలాగే అడ్డగోలుగా చేసి ఇష్టారీతిన ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తూ పోయారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. ఇప్పుడు రాత్రికి రాత్రి చంద్రబాబును అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఏ 37గా చేర్చి.. అసలు ఈ విషయంలో చంద్రబాబు చేసిన తప్పేమిటో చెప్పకుండా… అడ్డగోలు ఆరోపణలు చేస్తూ పోతున్నారు. అసలు కోర్టు కన్నా ముందు ప్రెస్ మీట్లలో ఇష్టారీతిన తప్పుడు ప్రచారానికి తగ్గడం లేదు.