పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే.. ఏపీ రాజకీయాల్లో .. లాయర్ పద్మనాభసింహా లాంటివారు. ఆయన ప్రెస్ మీట్ పెడితే దద్దరిల్లిపోవాల్సిందే. ఆయన కోర్టుల్లో వాదనలు విన్నవారు.. ఆయన ఏం వాదించారో మీడియాలో చూసిన వారు కూడా… మామూలు పద్మనాభసింహా కాదని బ్రహ్మానందం ఏ మాత్రం సరిపోడని అనుకుంటారు. ఆయనే ఎన్నికల కౌంటింగ్ కు ముందు ఆస్ట్రేలియా వెళ్లి… తన కంటే పెద్ద ఫ్యాక్షనిస్టు ఎవరుంటారని.. అసలు ఫ్యాక్షనిస్టులంటే.. గొప్పవాళ్ళన్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే ఆయన అక్కడ వారికి చెప్పని విషయం ఏమిటంటే.. ఆయన మైనింగ్ డాన్ కూడా.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన లాగా తన కుమారుడు ప్రత్యక్షంగా లాయర్.. పరోక్షంగా ఫ్యాక్షనిస్టు కావాలని కోరుకోలేదు. అవి ఓల్డ్ మోడల్ అనుకున్నారేమో కానీ.. మైనింగ్ లోకి దించారు. సేఫ్ గా ఉంటుందని చిత్తూరులోనే కలర్ గ్రానైట్ లీజుకు తీసుకున్నారు. అది ఎలా వచ్చిందో చెప్పాల్సిన పని లేదు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారిని కాదని ఆయనకు ఇచ్చారు. ఇప్పుడీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆయనకు లీజులు ఎలా దక్కాయి.. ఎంత తవ్వారు.. ప్రభుత్వానికి ఎంత లీజు కట్టారన్నదానిపై ఆరా తీస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే పొన్నవోలు కార్తీక్ రెడ్డి.. ఎక్కడా గనులు లేనట్లుగా.. మదనపల్లెలలోనే క్వారీ లీజుకు పొందారు. ఎందుకలా అన్నది మాత్రం తేలాల్సి ఉంది. చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రజా ఆస్తులన్నింటినీ గుప్పిటపట్టిన పెద్దిరెడ్డి ఇలా అస్మదీయులకు దక్కేలా చేశారు. ఈ వ్యవహరంలో పొన్నవోలు కార్తీక్ రెడ్డికి వన్ వే టిక్కెట్ బుక్ చేసుకుంటారా…,. టూ వే టిక్కెట్ ను తన తండ్రి బుక్ చేస్తారా అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.