పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే జగన్ మెచ్చిన లాయర్. ఎలా ఉండాలో అలా ఉంటారు. ఆయన ఏమంటారంటే.. పంది కొవ్వు పన్నెండు వందల రూపాయలు ఉంటుంది.. నెయ్యి నాలుగు వందలే ఉంటుంది.. అంత ఖరదైన దాన్ని నెయ్యిలో కల్తీ చేస్తారా అని లాజిక్ బయటకు తీశారు. అసలు పంది కొవ్వు ఎక్కడ తీస్తారు.. ఎక్కడ వాడతారు.. దానికో రేటు ఎక్కడ నుంచి వచ్చిందో ఆయన ఎలా తెలిసిందో ఈ లా పాయింట్ రేపు కోర్టులో కూడా వాదించే అవకాశం ఉంది. దానికి ఆయన ఇచ్చిన జస్టిఫికేషన్ ఇంకా గొప్పగా ఉంది అదేమిటంటే.. రాగిలో బంగారం కల్తీ చేస్తారా ?.. ఇత్తడిలో బంగారం కలుపుతారా..? అని ఆయన రెచ్చిపోయారు. ఈ మాటల ప్రకారం చూస్తే..నెయ్యి బదులు పందికొవ్వు వాడటం అంటే.. రాగిలో బంగారం కలిపినట్లే అనుకోవాలి.
ఆయన లా తెలివి తేటలు ఇంతటితో ఆగిపోలేదు. రిపోర్టులో ఎస్ వాల్యూ తక్కువగా ఉందంటే.. కల్తీ జరిగిందని అర్థమని.. కానీ అది పందికొవ్వు కాదని ఆయన చెబుతున్నారు. అంటే కల్తీ జరిగిందని ఒప్పుకుంటాను కానీ పంది కొవ్వు కాదని ఆయన వాదన. పంది కొవ్వు గురించి తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నంత కాన్ఫిడెన్స్ గా వాదిస్తున్న పొన్నవోలును చూసి జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. రేపు సుప్రీంకోర్టు, హైకోర్టులో.. దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు వస్తే ఇదే వాదనను రెడీ చేసుకుంటారేమో కానీ.. ఆయన వాదన మాత్రం… జగన్, పొన్నవోలు రేంజ్ లోనే ఉందని అర్థమవుతుందని ఇతర పార్టీల నేతలు సెటైర్లు వేస్తూంటే.. సొంత పార్టీ నేతలు గొణుక్కుంటున్నారు.
రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన.. కబేళాలకు తరలించిన వాటి నంచి తీసే వ్యర్థలు, ఎముకలతో తయారు చేసే నెయ్యి , నూనెలను మార్కెట్లోకి తరలించి అమ్ముకుంటున్నారన్న వార్తలు ఎన్నో చూశాం. తరచూ అలాంటి కుటీర పరిశ్రమల్ని కూడా పట్టుకుంటూ ఉంటారు. పొన్నవోలు … అత్యంత స్వచ్చమైన పందికొవ్వును తెచ్చి.. నెయ్యిలో కలుపుతున్నారని.. అది చాలా కాస్ట్ లీ అని ఫీలవుతున్నారు. మొత్తంగా పొన్నవోలు తన వాదనలతో.. మంట పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.