వైసీపీ ఆస్థాన న్యాయకోవీదుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుమారుడు ఆయన లాగా లాయర్ కాలేదు. తండ్రి లాయర్ అయితే తాను ఎందుకు లాయర్ అవ్వాలనుకున్నాడో కానీ.. మైనింగ్ డాన్ అయ్యాడు. ఎక్కడ పడితే అక్కడ మైనింగ్ లీజులు తీసుకుని తవ్వేసుకుంటున్నారు. గతంలో బయటకు వచ్చిన లీజులు కన్నా ఇంకా చాలా ఉన్నాయని తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ కోసం..జగన్ కోసం.. టీడీపీ నేతలపై కేసుల విషయంలో అడ్డగోలు వాదనలు వినిపించడంలో భిన్నమైన పటిమ చూపే పొన్నవోలు.. తన కుమారుడికి మైనింగ్ లీజులు ఇప్పించడంలోను పాటుదేలిపోయారు.
రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో కూడా పొన్నవోలు కుమారుడికి మైనింగ్ లీజులు ఉన్నట్లుగా తాజాగా వెల్లడయింది. వైసీపీ హయాంలో ప్రభుత్వ సహజ సంపద అంటే.. తమ సొంత సంపద అన్నట్లుగా వైసీపీ నేతలు రెచ్చిపోయారు. దొరికినవి దొరికినట్లుగా దోచుకున్నారు. కొండలు, గుట్టలు దేన్నీ వదిలి పెట్టలేదు. ఈ క్రమంలో ఎవరికి దొరికింది వారు పంచుకున్నారు. అందులో పొన్నవోలు కూడా తమ కుమారుడ్ని ప్రోత్సహించి దొరికింది అందుకున్నారు.
పొన్నవోలు కుమారుడికి లీజులు కేటాయించడంలో అప్పటి మైనింగ్ అధికారి.. వెంటకరెడ్డిదే కీలక పాత్ర. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినా .. ఓ రోజు ఏసీబీ కోర్టు అప్పటికప్పుడు బెయిల్ మంజూరు చేసింది. అదే రోజు ఆయన విడుదలై వెళ్లిపోయాడు. తర్వాత అనేక కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.