పీటీ వారెంట్ మీద ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. ఆ పీటీ వారెంట్ అమలవుతున్నట్లే అని ప్రభుత్వ న్యాయవాది వాదిస్తే.. అలాంటిదేమీ లేదు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాతనే పిటీ వారెంట్ అమలు చేసినట్లు అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయమూర్తి ముందు తనదైన శైలిలో వాదిస్తున్నారో బెదిరిస్తున్నారో తెలియనట్లుగా తన ప్రతిభ చూపారు. పీటీ వారెంట్ ను చూపించి పోసానిని కర్నూలు జైలు నుంచి ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో అప్పుడే పీటీ వారెంట్ అమలైనట్లు అనేది చెట్టు కిందప్లీడర్ కు తెలుసు. కోర్టులో హాజరు పరిస్తే కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది తర్వాత సంగతి. కానీ పొన్నవోలు పీటీ వారెంట్ అమలు కాలేదని..దాన్ని క్వాష్ చేయాలని పిటిషన్ వేయించి మరీ వాదించారు. చివరికి అది డిజాస్టర్ గామారింది. దాంతో పోసాని ఏడుపొక్కటే మిగిలింది.
పోసానికి పొన్నవోలు ఎలా పట్టుకున్నారో తెలియదు కానీ ఆయన వాదిస్తున్న కేసుల్లో బెయిల్ వస్తుందని ఆశ పడుతున్నా సరే రావడం లేదు. ఇతరులు వాదిస్తున్న కేసుల్లో సులువుగా బెయిల్స్ వస్తున్నాయి. నరసరావుపేట కోర్టులో కస్టడీ కి రెండు రోజులు ఇచ్చినా సరే వెంటనే బెయిల్ లభించింది. అక్కడ వాదించింది పొన్నవోలు కాదు. రైల్వే కోడూరు కోర్టులో వాదించి విఫలమైన తర్వాత పొన్నవోలు.. ఈ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్టు చేస్తారని అందుకే బెయిల్ కోసం పెద్దగా పట్టుబట్టలేదనట్లుగా చెప్పుకొచ్చారు.
పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఇలా పోసాని లాంటి వారి కోసం కాకుండా.. 14ఏ నిబంధనను సైతం కాదని చంద్రబాబును రిమాండ్ కు పంపేలా వాదించిన ఆయన ప్రతిభను జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి వంటి వారు ఉపయోగించుకోవాలని .. పోసాని లాంటి వారిని వదిలేయాలన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. అయితే పొన్నవోలు మాత్రం తన కంటే పెద్ద లాయర్ ఈ భూమండలం మీద లేరన్న నమ్మకంతో వాదిస్తూ ఉంటారు. అయితే ఆ వాదనలు.. బెదిరింపుల్లా ఉండటంతోనే చాలా సమస్యలు వస్తున్నాయి.