అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథమ్’లో బ్రాహ్మణుల అబ్బాయితో ప్రేమలో పడిన అమ్మాయిగా నటించిన పూజా హెగ్డే, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘సాక్ష్యం’లో బ్రాహ్మణుల అమ్మాయిగా నటిస్తోంది. రోల్ రివర్స్ అయ్యింది అన్నమాట! తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో పూజ క్యారెక్టర్లకు బ్రాహ్మిణ్ కనెక్షన్ ఉండటం విశేషమే. ‘దువ్వాడ జగన్నాథమ్’లో అల్లు అర్జున్ ట్రెడిషనల్ బ్రాహ్మిణ్ యువకుడిగా నటిస్తే, పూజ హాట్ హాట్ గా బికినీలో అందాలు చూపించింది. కానీ, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘సాక్ష్యం’లో ట్రెడిషనల్ అండ్ కన్జర్వేటివ్, మిడిల్ క్లాస్ బ్రాహ్మిణ్ ఫ్యామిలీ అమ్మాయిగా నటిస్తుంది. అలాగని పూర్తిగా ట్రెడిషనల్ డ్రస్సుల్లో మాత్రమే కనిపించదు. ఇండియన్ అండ్ వెస్ట్రన్ డ్రస్సుల్లో అందంగా కనిపిస్తానని పూజ చెబుతోంది. ‘సాక్ష్యం’ కోసం ఫేమస్ బాలీవుడ్ డిజైనర్ నీతా లుల్లా చేత పూజా హెగ్డే కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించుకుంటోంది. ‘సాక్ష్యం’లో నటిస్తూ ‘రంగస్థలం’లో ఐటమ్ సాంగ్ చేసింది పూజ. ఇవి కాకుండా మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనీదత్ నిర్మించనున్న సినిమాకు సంతకం చేసింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలోనూ పూజా సెలెక్ట్ అయినట్టు ఫిల్మ్ నగర్ టాక్.