బాలీవుడ్ అంటే కొందరు హీరోయిన్లకి భలే మోజు. ముఖ్యంగా నార్త్ నుండి వచ్చే భామలకు. సౌత్ లో స్కై లెవల్ స్టార్ డమ్ సంపాదించుకున్నప్పటికీ .. వాళ్ళ మనసు మాత్రం బాలీవుడ్ పైనే వుంటుంది. అక్కడ ఓ హిట్ కొట్టి సెటిల్ అయిపోవాలని తెగ తాపత్రయ పడిపోతుంటారు. తమన్నా, కాజల్, రకుల్.. ఈ బాపతే. అయితే బాలీవుడ్ ప్రయత్నాలు చేసి బొక్కాబోర్ల పడి మళ్ళీ సౌత్ లో సెటిల్ అయ్యారు.
పూజా హెగ్డే కూడా ఈ తానులోని ముక్కే. ఓ తమిళ సినిమాతో తెరకి పరిచయమై సౌత్ ద్రుష్టిని ఆకర్షించింది పూజా. ఇక టాలీవుడ్ ఆమెకు రెడ్ కార్పెట్ పరిచింది. కానీ పూజ మనసు మాత్రం బాలీవుడ్ పైనే వుంది. టాలీవుడ్ లో ఆఫర్లు ఉదృతంగా ఉండగానే హ్రితిక్ రోషన్ కి రెండేళ్ళ బల్క్ డేట్స్ ఇచ్చేసింది. అయితే వీరి కలయికలో వచ్చిన ‘మొహన్జుదారో’ అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. దీంతో మళ్ళీ టాలీవుడ్ బాట పట్టింది. మనోళ్ళు మళ్ళీ రెడ్ కార్పెట్ పరిచారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్.. ఇలా వరుసగా బడా సినిమాలు ఆమె ఖాతాలోకి వెళ్ళిపోయాయి.
అయితే పూజా మనసు మాత్రం బాలీవుడ్ పైనే వుంది. ఇక్కడ కొన్ని క్రేజీ సినిమాలు పక్కన పెట్టి హౌస్ ఫుల్4లో చేసింది. కానీ ఈ సినిమా ఆమె ఆశలపై నీళ్ళు చల్లింది. గత వారం వచ్చిన సినిమాకి ఫ్లాఫ్ టాక్ వచ్చింది. రెంటింగులు కూడా దారుణంగా ఇచ్చారు. పూజా నటన పై కూడా విమర్శలు వచ్చాయి. మొత్తంమీద మరో బాలీవుడ్ ఫ్లాఫ్ ని మూట కట్టుకుంది పూజా. బాలీవుడ్ లో కూడా సెంటిమెంట్లు ఎక్కవ. ఇప్పటికే తమన్నా, కాజల్, రకుల్ అక్కడ డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు పూజా కూడా అక్కడ ఫ్లాఫ్ హీరోయిన్స్ లిస్టు లో చేరిపోయింది. అక్కడ ఇంకొ ఫ్లాఫ్ గానీ పడితే .. ఇంక పూజా బాలీవుడ్ ఆశలు గల్లంతయినట్లే.