పూజా హెగ్డేకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పూజా ముంబైలో ఓ ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిందట. అదీ వార్త. సినిమా సెలబ్రెటీలు ఇళ్లూ, ఫ్లాటులూ, కార్లూ కొనేయడం పెద్ద వింతేం కాదు. కాకపోతే.. ఆ బంగ్లా ఖరీదు ఏకంగా రూ.45 కోట్లని టాక్. ఇంత విలాసవంతమైన బంగ్లాని ఇప్పటి వరకూ ఓ దక్షిణాది నటి సొంతం చేసుకోలేదట. అందుకే పూజా కొన్న ఆ ఇంటి గురించి బాలీవుడ్ మీడియా కథలు కథలుగా రాస్తోంది. ఈమధ్య ఫామ్ కోల్పోయి, అవకాశాలు తగ్గిపోయిన పూజా ఇన్ని కోట్లు పెట్టి ఎలా కొంది? అన్ని డబ్బులు ఎలా వచ్చాయని చెవులు కొరుక్కొంటున్నారు. ముంబైలో ఇల్లు కొనేసిందంటే ఇక, అక్కడ సెటిలైపోవొచ్చని, సౌత్ సినిమాలపై ఫోకస్ తగ్గించే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి పూజాకి హైదరాబాద్ లో కూడా ఓ ఫ్లాట్ ఉంది. తెలుగులో సినిమాలు చేస్తున్న కొత్తలోనే ఇక్కడో విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా అక్కడే మకాం.
పూజా మంచి ఫామ్లో ఉన్నప్పుడు సినిమాకు రూ.3 కోట్ల వరకూ డిమాండ్ చేసేది. ఒక్కోసారి ఆమె చేతిలో మూడు, నాలుగు సినిమాలుండేవి. కమర్షియల్ యాడ్లు కూడా బాగానే చేసింది. కాబట్టి… పూజా లాంటి స్టార్, రూ.45 కోట్లు పెట్టి విలాసవంతమైన ఇంటిని కొనడం పెద్ద వింతేం కాదు. కాకపోతే.. ఇప్పుడు పూజా చేతిలో పెద్దగా సినిమాల్లేవు. అయినా సరే, తన సంపాదనంతా ఇంటిపై పెట్టేసిందంటే సాహసమే అని చెప్పుకోవాలి.